5వ టెస్టు, 4వ రోజు: కుక్‌తో పాటు కోహ్లీ, రాహుల్ నమోదు చేసిన రికార్డులివే

England vs India 5th Test Day 4 Stats: Alastair Cook breaks several records in final innings

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు డ్రాగా ముగిస్తుందా? లేక కోహ్లీసేన షరా మామూలుగానే చేతులెత్తేస్తుందా? అని ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆటలో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం భారత బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలబడే తీరుని బట్టి ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది కాబట్టి.

464 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో 3 వికెట్లకు 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (46 బ్యాటింగ్‌), రహానె (10 బ్యాటింగ్‌) ఉన్నారు. విజయానికి ఇంకా 406 పరుగుల దూరంలో ఉండగా చేతిలో ఏడు వికెట్లున్నాయి.

ఆటలో భాగంగా నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు పలు రికార్డులు నమోదు చేసింది. తన కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడుతోన్న ఓపెనర్ అలెస్టర్ కుక్ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు చేశాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం....

1
42378
అలెస్టర్ కుక్ అరుదైన ఘనత

అలెస్టర్ కుక్ అరుదైన ఘనత

1- అరంగేట్రం, చివరి టెస్టుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు (12,472) చేసిన ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌గా సంగక్కర (12,400)ను కుక్‌ అధిగమించాడు.
అలెస్టర్ కుక్ 12472
కుమార సంగక్కర 12400
బ్రియాన్ లారా 11953
శివనారాయణ్ చందర్‌పాల్ 11867

మూడో జోడీగా అలెస్టర్ కుక్-జో రూట్

మూడో జోడీగా అలెస్టర్ కుక్-జో రూట్

3- ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో జోడీగా అలెస్టర్ కుక్-జో రూట్ జోడీ నిలిచింది.
382 లేలాండ్ with లెన్ హుట్టన్ vs ఆస్ట్రేలియా, ఓవల్, 1938
320 జాసన్ గిలెస్పీ with మైకేల్ హాస్సీ vs బంగ్లాదేశ్, చిట్టగాంగ్, 2006
259 అలెస్టర్ కుక్ with జో రూట్ vs ఇండియా, ఓవల్, 2018
234 అరవింద్ డిసిల్వా with సనత్ జయసూర్య vs కొలంబో, 2002

 అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

3- భారత ఓడిన టెస్టు సిరిస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి, మూడో స్థానంలో నిలిచాడు.
692 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా, 2014/15
598 మొహిందర్ అమర్నాథ్ vs వెస్టిండిస్, 1982/83
593 విరాట్ కోహ్లీ vs ఇంగ్లాండ్, 2018
584 మొహిందర్ అమర్నాథ్ vs పాకిస్థాన్, 1982/83
568 గుండప్ప విశ్వనాథ్ vs వెస్టిండిస్, 1974/75

సెంచరీ భాగస్వామ్యాలు

సెంచరీ భాగస్వామ్యాలు

4- టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెస్టర్ కుక్ నాలుగో స్థానంలో నిలిచాడు.
88 Rahul Dravid
86 Sachin Tendulkar
85 Ricky Ponting
77 Alastair Cook
76 Mahela Jayawardene

టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా కుక్

టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా కుక్

5- అరంగేట్రం, చివరి టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో క్రికెటర్‌గా అలెస్టర్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కుకే కావడం విశేషం.
104 | 146 రెగినాల్డ్‌ డఫ్‌
110 | 266 బిల్‌ పాన్స్‌ఫోర్డ్‌
108 | 182 గ్రెగ్‌ చాపెల్‌
110 | 102 అజహరుద్దీన్‌
104| 147 అలెస్టర్ కుక్

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి

8 - ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు శామ్ కుర్రన్ అరుదైన ఘనత సాధించాడు.

అత్యధిక సెంచరీలు

అత్యధిక సెంచరీలు

13 - టెస్టు క్రికెట్‌లో మూడో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కుక్ నిలిచాడు.
13 అలెస్టర్ కుక్
12 కుమార సంగక్కర
10 మాథ్యూ హెడెన్, జాక్వస్ కల్లిస్, సచిన్ టెండూల్కర్
9 ఆమ్లా, అలెన్ బోర్డర్

అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడు

అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడు

14- ఒక టెస్టు సిరిస్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ అరుదైన ఘతన సాధించాడు.
14 KL Rahul vs England, 2018
13 Rahul Dravid vs Australia, 2004
12 Eknath Solkar vs England, 1972-73
ఒక టెస్టు సిరిస్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితా:
15 Jack Gregory vs Eng, 1920/21
14 Greg Chappell vs Eng, 1974/75
14 KL Rahul vs Eng, 2018

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

382 - మొదటి, ఆఖరి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే:
425 - బిల్ ఫోన్స్ ఫోర్డ్
396 - ఆండీ సంధామ్
392 - రెగెనాల్డ్ పోస్టర్
382 - అలెస్టర్ కుక్
369 - లారెన్స్ రోయి

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Tuesday, September 11, 2018, 13:28 [IST]
  Other articles published on Sep 11, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more