న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేజారిన పదో సిరిస్: మూడో వన్డేలో భారత్ ఓటమి, సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

By Nageshwara Rao
England

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ సన్నాహాకాల్లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాప్ ఆర్డర్ వైఫల్యం చెందడంతో పదో సిరీస్ చేజారింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

257 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 44.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 260 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో రూట్ (120 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (108 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (72 బంతుల్లో 71; 8 ఫోర్లు), ధావన్ (49 బంతుల్లో 44; 7 ఫోర్లు), ధోనీ (66 బంతుల్లో 42; 4 ఫోర్లు) ఫరవాలేదనిపించారు.


ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 257

హెడ్డింగ్లే వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కోహ్లీ(71) హాఫ్ సెంచరీతో రాణించగా.. శిఖర్ ధావన్(44), ధోని(42) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.

India

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు.

అయితే 18వ ఓవర్‌ నాలుగో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ధావన్(44) పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 48వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించి దినేశ్ కార్తీక్(21) అదిల్ రషీద్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.



ఆ తర్వాత ధోనితో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లీ(71) రషీద్ వేసిన 31వ ఓవర్ తొలి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రైనా(1) స్లిప్‌లో ఉన్న రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్థిక్ పాండ్యా(21) ఇంగ్లండ్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడలేకపోయాడు.

మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం భువీతో కలిసి ధోని పరుగుల రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ధోనీ విల్లీ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

India

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ 13 బంతుల్లో రెండు సిక్సులతో 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, విల్లీ చెరి మూడు, వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.


మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ నిరాశపరిచాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి దినేష్ కార్తీక్ (21) పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 28 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ ఔటైన తర్వాత ధోని క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ(65), ధోని(7) పరుగులతో ఉన్నారు.


హాఫ్ సంచరీ నమోదు చేసిన కోహ్లీ
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్‌ శర్మ ఔట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో లియామ్‌ ప్లంకెట్‌ వేసిన 23.4వ బంతికి బౌండరీ బాది హాప్ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 48వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (55), ధోని(2) పరుగులతో ఉన్నారు.


రెండో కోల్పోయిన భారత్, ధావన్ రనౌట్
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మొయిన్‌ అలీ వేసిన 18ఓవర్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (44) స్టోక్స్‌ చేతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కోహ్లీ(41) జోరు కొనసాగిస్తున్నాడు. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(41), దినేశ్‌ కార్తీక్‌(10) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన భారత్
హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(5), ధావన్(11) పరుగులతో ఉన్నారు.


భారత్ బ్యాటింగ్, మూడు మార్పులతో బరిలోకి

మూడు వన్డేల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక 3వ వన్డే ప్రారంభమైంది. లీడ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ టాస్‌ గెలిచి కోహ్లీసేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది.

కేఎల్‌ రాహుల్‌ స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు సిద్ధార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌ స్థానాల్లో శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ జట్టులోకి వచ్చారు. ఇక ఇంగ్లండ్‌ విషయానికొస్తే జాసన్‌ రాయ్‌ను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేసింది. అతని స్థానంలో జేమ్స్‌ విన్సేకి అవకాశం కల్పించింది.

తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియా.. పేలవ బ్యాటింగ్‌తో రెండో వన్డేలో 86 పరుగుల తేడాతో కోహ్లీసేన చిత్తుగా ఓడింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

1
42373

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పదో వన్డే సిరీస్‌ను సాధించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. 2016లో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. ఆ తర్వాత ఏ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌నూ కోల్పోలేదు. ఈ క్రమంలోనే వరుసగా పదో వన్డే సిరీస్‌ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది.

టాస్ అనంతరం మోర్గన్ మాట్లాడుతూ ''వికెట్ చాలా బాగుంది. ఇక్కడి పిచ్ మొత్తం 100 ఓవర్లలో ఇలాగే ఉంటుంది. పిచ్ ఇలా ఉండటం చాలా అరుదు. ఇండియాలాంటి జట్టుతో ఇక్కడ ఆడటం చాలా సంతోషంగా ఉంది. హాంప్‌షైర్‌లో అద్భుత ఫాంలో ఉన్న విన్స్‌.. రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చాడు'' అని అన్నాడు.

ఆ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ''ప్రపంచంలో నంబర్ వన్ జట్టుతో ఆడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. వాళ్లు ఏక్షణాన్నైన పుంజుకోవచ్చు. మా సత్తా నిరూపించుకొనేందుకు ఇదొక మంచి అవకాశం. పిచ్ కూడా చాలా బాగుంది. స్పిన్నర్లుకు ఇది బాగా అనుకూలిస్తుంది. రాహుల్ స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. దినేశ్ ఒక వ్యూహాత్మక మార్పు'' అని అన్నాడు.

ఇక్కడ ఆడిన చివరి నాలుగు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ జట్టే విజేతగా నిలిచింది. గత ఐదేళ్ల నుంచి లీడ్స్ మైదానంలో సగటు స్కోరు 298గా నమోదైంది.

జట్ల వివరాలు:
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, జేమ్స్ విన్స్, జో రూట్, ఇయాన్ మోర్గన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(కీపర్), మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, లైమ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.

ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), దినేశ్ కార్తీక్, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, యుజవేంద్ర చాహల్.

Story first published: Wednesday, July 18, 2018, 6:15 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X