న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs AUS: జో రూట్‌పై వేటు.. ఆశ్చర్యపోయిన స్టీవ్ ‌స్మిత్!!

 England vs Australia: Steve Smith Surprised By Joe Roots Omission From England T20I Squad

లండన్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంగ్లీష్ గడ్డపై వరుస పెట్టి సిరీస్‌లను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా విరామం అనంతరం బయో బబుల్ సృష్టించి మొదటగా వెస్టిండీస్‌తో సిరీస్ ఆడింది. ఆపై ఐర్లండ్ జట్టుతో.. తాజాగా పాకిస్తాన్ పర్యటనను కూడా విజయవంతంగా ముగించింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైంది.

టీ20ల్లో రూట్‌కు దక్కని చోటు:

టీ20ల్లో రూట్‌కు దక్కని చోటు:

ఆస్ట్రేలియా సిరీస్ కోసం మంగళవారం ఈసీబీ వన్డే, టీ20 జట్లని ప్రకటించింది. వన్డే జట్టులోకి జో రూట్‌ని ఎంపిక చేసిన ఈసీబీ.. టీ20 టీమ్‌లో మాత్రం అతనికి చోటివ్వలేదు. మూడు ఫార్మాట్లలోనూ స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న జో రూట్..‌ ఇంగ్లండ్ టీ20 టీమ్‌లో లేకపోవడమేంటి? అని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జాసన్ రాయ్ మరియు బెన్ స్టోక్స్ కూడా జట్టులో లేరు. శుక్రవారం సౌతాంప్టన్‌లో తొలి టీ20 ప్రారంభం కానుంది.

స్టీవ్‌ స్మిత్ ఆశ్చర్యం:

స్టీవ్‌ స్మిత్ ఆశ్చర్యం:

'టీ20 సిరీస్‌లో జో రూట్‌కి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. రూట్ మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటగాడు. బహుశా దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌లకే ఇంగ్లండ్ టీ20 టీమ్‌లో చోటు దక్కిందేమో?. అయితే ఎవరి గేమ్ ప్లాన్‌లు వారికి ఉంటాయి. అందరూ ఒకేలా ఆడితే.. బోర్ కొడుతుంది' అని స్టీవ్ ‌స్మిత్ అన్నాడు. ఇంగ్లీష్ జట్టుకు టెస్ట్ ఫార్మాట్‌లో రూట్ కెప్టెన్‌గా ఉండగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇయన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నాడు.

ఇంగ్లండ్ టీ20 జట్టు:

ఇంగ్లండ్ టీ20 జట్టు:

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోప్రా ఆర్చర్, జొనాథన్ బెయిర్‌‌స్టో, టామ్ బాంటన్, శామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, టామ్ కరన్, జో డెన్లీ, క్రిస్‌ జోర్దాన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్. రిజర్వ్ ఆటగాళ్లగా లివింగ్‌ స్టోన్, ఎస్ మహ్మద్ ఉన్నారు.

ఇంగ్లండ్ వన్డే జట్టు:

ఇంగ్లండ్ వన్డే జట్టు:

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోప్రా ఆర్చర్, బెయిర్‌స్టో, టామ్ బాంటన్, శామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కరన్, టామ్ కరన్, ఆదిల్ రషీద్, జో రూట్, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్. జో డెన్లీ, ఎస్ మహ్మద్ రిజర్వ్ ఆటగాళ్లగా ఎంపికయ్యారు.

ఆ విషయం తెలిశాక మేఘాల్లో తేలిపోయా: కోహ్లీ

Story first published: Wednesday, September 2, 2020, 15:53 [IST]
Other articles published on Sep 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X