న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసవత్తరంగా యాషెస్ మూడో టెస్టు: ఇంగ్లాండ్ 67 ఆలౌట్

England vs Australia Ashes 2019 Live Score 3rd Test Day 2: Hazlewood takes 5-wicket haul as Eng bowled out for 67

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 179 పరుగులకే ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 67 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో లార్డ్స్ టెస్టు మాదిరి కాకుండా ఈ టెస్టు ఫలితాన్ని క్రికెట్ అభిమానులు ఊహించొచ్చు.

ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జో డెన్లీ ఒక్కడే రెండంకెల స్కోరు సాధించగా... మిగితా వారంతా నిరాశ పరిచారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లకు గాను 67 పరుగులు చేసి ఆలౌటైంది.

<strong>ఆస్ట్రేలియన్లకు నువ్విచ్చిన పంచ్ నాకెంతో నచ్చింది: కోహ్లీకి రిచర్డ్స్ ప్రశంస</strong>ఆస్ట్రేలియన్లకు నువ్విచ్చిన పంచ్ నాకెంతో నచ్చింది: కోహ్లీకి రిచర్డ్స్ ప్రశంస

1948 తర్వాత ఈ మైదానంలో ఇంగ్లాండ్ అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. యాషెస్ టెస్టు సిరిస్‌లో ఈ వేదికలో నమోదైన అత్యల్ప స్కోరు కూడా ఇదే. 1909లో ఇంగ్లాండ్ సాధించిన 87 పరుగులే ఈ స్టేడియంలో ఇప్పటివరకు అత్యల్పం కాగా, నేటి మ్యాచ్‌లో ఆ రికార్టు కనుమరుగైంది.

112 పరుగుల ఆధిక్యం

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 112 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా యాషెస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లను పట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరిస్‌లో ఇప్పటివరకు 11 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.

నాలుగు క్యాచ్‌లు పట్టిన వార్నర్

2017లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. స్టీవ్ స్మిత్ తర్వాత మళ్లీ వార్నర్‌ ఈ ఘనత సాధించాడు. రెండో రోజు ఆటలో భాగంగా డేవిడ్ వార్నర్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌లను క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు చేర్చాడు. పేస్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగారు.

ఐదు వికెట్లు తీసిన జోష్ హెజెల్‌ఉడ్

ఆసీస్ బౌలర్లలో జోష్ హెజెల్‌ఉడ్ 5 వికెట్లతో ఇంగ్లాండ్‌ను శాసించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్(9), జేసన్ రాయ్(9) పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతర డో డెన్లీ(12), బెన్ స్టోక్స్(8), జానీ బెయిర్ స్టో(4), జోస్ బట్లర్(5), క్రిస్ వోక్స్(5), ఆర్చర్(7) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.

179 పరుగులకే ఆసీస్ ఆలౌట్

ఆసీస్ బౌలర్లలో జోష్ హాజెల్‌ఉడ్ 5 వికెట్లు తీయగా, ప్యాటిన్సన్ 2, కమ్మిన్స్‌ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 52.1 ఓవర్లకు గాను 179 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్‌ ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

Story first published: Friday, August 23, 2019, 19:21 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X