న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయ్ సెంచరీ: 4వ వన్డేలో ఇంగ్లాండ్ విజయం, వైట్‌వాష్‌ దిశగా ఆసీస్‌!

By Nageshwara Rao
England vs Australia 4th ODI: England win by six wickets

హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై ఆస్ట్రేలియా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఐదు వన్డేల సిరిస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మరో విజయం సాధిస్తే ఆస్ట్రేలియాకు వైట్ వాష్ తప్పదు. గురువారం జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ సిరిస్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది.

సెంచరీతో చెలరేగిన ఫించ్‌, మార్ష్

సెంచరీతో చెలరేగిన ఫించ్‌, మార్ష్

ఆసీస్ బ్యాట్స్‌మన్లలో ఓపెనర్‌ ఆరోన్ ఫించ్‌ (100), షాన్‌ మార్ష్‌ (101) సెంచరీలు నమోదు చేయగా, ట్రావిస్ హెడ్‌ (63) పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ నాలుగు వికెట్లు తీసుకోగా, వుడ్, ఆదిల్‌ రషీద్‌లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అనతంరం 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు.

జాసన్‌ రాయ్‌ సెంచరీ

జాసన్‌ రాయ్‌ సెంచరీ

జాసన్‌ రాయ్‌(101; 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో (79; 66 బంతుల్లో 10 ఫోర్లు) రాణించాడు. దీంతో తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొమ్మిది పరుగుల వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత బరిలోకి దిగిన మిగతా బ్యాట్స్‌మన్ రాణించారు.

29 బంతుల్లో బట్లర్ 54

29 బంతుల్లో బట్లర్ 54

చివర్లో జోస్ బట్లర్‌ (54; 29 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్సర్‌) చెలరేగటంతో మరో 32 బంతులు మిగిలుండగానే ఇంగ్లాండ్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ బౌలర్లలో అగర్‌ రెండు వికెట్లు తీసుకోగా.. స్టాన్‌లేక్‌, లియాన్‌లు తలో వికెట్‌ సాధించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు పలు రికార్డులను నమోదు చేసింది. ఛేజింగ్‌ పరంగా(312పరుగుల) ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియాపై ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

ఇంగ్లాండ్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్ అరుదైన రికార్డు

2008లో ఇంగ్లాండ్ చేసిన 308 పరుగల ఛేదనే ఇప్పటివరకు అత్యుత్తమం. దీంతో పాటు ఒక క్యాలెండ్‌ ఇయర్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన 9 వన్డేల్లో ఇంగ్లాం‍డ్‌ ఎనిమిది విజయాలు సాధించింది. టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ వన్డేలో గనుక విజయం సాధిస్తే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాల రికార్డును ఇంగ్లాండ్‌ తిరగరాయనుంది.

Story first published: Friday, June 22, 2018, 11:00 [IST]
Other articles published on Jun 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X