న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 రెండోదశ కష్టమే.. వాళ్లదే తుది నిర్ణయం!!

England opener Jos Buttler is likely to miss IPL 2021 phase 2

లండన్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) రెండో దశలో తాను ఆడడం కష్టమే అని ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ అన్నాడు. సాధారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని, రే షెడ్యూల్ కారణంగా ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నాడు. టీ20 ప్రపంచకప్‌ ముందు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ పర్యటనలు ఇంగ్లండ్ జట్టు ఆడాల్సిఉందని బట్లర్‌ చెప్పాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ ఐపీఎల్‌ 2021.. సెప్టెంబర్‌-అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ది టెలిగ్రాఫ్‌తో జోస్‌ బట్లర్‌ మాట్లాడాడు. 'సాధారణంగా ఐపీఎల్‌ సమయంలో మరే అంతర్జాతీయ సిరీసులు ఉండవు. అందుకే లీగ్‌ సులభంగా పూర్తవుతుంది. మాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌ ఉన్నప్పుడు జరిగితే మాత్రం ఇంగ్లండ్‌దే తుది నిర్ణయం. జాతీయ జట్టు తర్వాతే అన్ని' అని బట్లర్‌ అన్నాడు. అయిదు వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం అయింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) తేదీలను ముందుకు జరిపేందుకు వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు అంగీకరించింది. 7 నుంచి 10 రోజులు ముందుకు జరపాలని నిర్ణయించిందని సమాచారం.

Michael Holding:నేను యూకేలో పెరిగి ఉంటే.. ఇంతకాలం బతికేవాడిని కాదేమో! హోల్డింగ్‌ సంచలన వ్యాఖ్యలు!!Michael Holding:నేను యూకేలో పెరిగి ఉంటే.. ఇంతకాలం బతికేవాడిని కాదేమో! హోల్డింగ్‌ సంచలన వ్యాఖ్యలు!!

పలు జట్లలో కరోనా వైరస్‌ కేసులు రావడంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ సగంలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిరవధికంగా వాయిదా పడిన సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ సమయంలో ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు వచ్చే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయా బోర్డులు ఇప్పటికే ఆటగాళ్లకు స్పష్టం చేశాయి. జాతీయ జట్టుకు ఎంపికవ్వని వాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుకోవచ్చని చెప్పాయి.

కరోనా పరిస్థితుల్లో ఇంగ్లండ్ రొటేషన్‌ విధానాన్ని జోస్‌ బట్లర్‌ ప్రశ్నించాడు. షెడ్యూల్‌ను పక్కాగా రూపొందిస్తే అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు మ్యాచులు మిస్సవ్వరన్నాడు. 'పాలకులకు ఇది మంచి ప్రశ్న. మేం విపరీతంగా క్రికెట్‌ ఆడుతున్నాం. మా కెరీర్లు చిన్నవని తెలుసు. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా ఆడాలనే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసింది. ఇలాంటప్పుడే ఆటగాళ్లను సంరక్షించాల్సింది. ప్రణాళికలు సరిగ్గా ఉంటేనే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. లేదంటే సమతూకం కష్టం' అని రాయల్స్ ఆటగాడు పేర్కొన్నాడు.

Story first published: Tuesday, June 22, 2021, 15:00 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X