సరికొత్త స్లెడ్జింగ్: 'స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ యాషెస్ గెలవలేదు'

Posted By:

హైదరాబాద్: నవంబర్ 23న బ్రిస్టల్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరిస్ ప్రారంభమవుతుంది. అయితే యాషెస్ సిరిస్‌కు ముందే ఆసీస్ మాటల యుద్ధం మొదలు పెట్టింది. తన ప్రత్యర్ధి ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించేందుకు సరికొత్త స్లెడ్జింగ్‌కు తెరలేపింది.

 యాషెస్‌ సిరిస్‌ నుంచి స్టోక్స్‌ని తప్పించిన బోర్డు

యాషెస్‌ సిరిస్‌ నుంచి స్టోక్స్‌ని తప్పించిన బోర్డు

యాషెస్‌ టెస్టు సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో బెన్ స్టోక్స్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ లేకపోతే ఇంగ్లాండ్ యాషెస్ గెలవలేదంటూ ఇటీవల ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడిన సంగతి తెలసిందే. తాజాగా చాపెల్ సరసన ఆస్ట్రేలియా టెస్టు గ్రేట్ స్టీవా కూడా చేరాడు.

స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ యాషెస్ గెలవలేదు

స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ యాషెస్ గెలవలేదు

బెన్ స్టోక్స్ లేకుండా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరిస్‌ను గెలవలేదని స్పష్టం చేశాడు. స్కై స్పోర్ట్స్ రేడియోకి ఇచ్చిన ఇంటర్యూలో స్టీవ్ వా మాట్లాడుతూ 'స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవలేదు. అతను యాషెస్‌లో లేకపోతే ఇంగ్లండ్ ఆ సిరీస్ గెలిచే ప్రసక్తే ఉండదు' అని అన్నాడు.

 స్టోక్స్‌ను ఆసీస్‌కు పంపడానికి ఇంగ్లాండ్ సెలక్టర్లు

స్టోక్స్‌ను ఆసీస్‌కు పంపడానికి ఇంగ్లాండ్ సెలక్టర్లు

'అయితే, ఆ సమయానికి స్టోక్స్ వస్తాడనే నేను అనుకుంటున్నా. ఏదో రకంగా స్టోక్స్‌ను ఆసీస్‌కు పంపడానికి ఇంగ్లాండ్ సెలక్టర్లు కృషి చేస్తారు. ఎందుకంటే అతనొక అత్యుత్తమ ఆటగాడు కాబట్టి. ఒకవేళ యాషెస్‌కు చివరి నిమిషంలో స్టోక్స్ కనుక పంపిస్తే అంతకంటే అవమానం మరొకటి ఉండదు' అని స్టీవ్ వా అన్నాడు.

3-1తో యాషెన్‌ను ఆసీస్ సొంతం చేసుకుంటుంది

3-1తో యాషెన్‌ను ఆసీస్ సొంతం చేసుకుంటుంది

'బెన్ స్టోక్స్ లేకపోతే ఆసీస్ యాషెస్ సిరిస్‌ను తప్పక గెలుస్తుంది. బ్రాడ్, ఆండర్సన్‌లపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-1తో సొంతం చేసుకుంటుంది' అని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 12, 2017, 15:16 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి