న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఛేజింగ్ చేతకాదు': ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లాండ్‌పై ట్రోలింగ్

England Cant Chase: Cricketing fraternity reacts to Australia defeat

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో ఇంగ్లాండ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న భారీ అంచనాలతో బరిలోకి దిగింది. టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చేధనలో పూర్తి ఓవర్లు ఆడలేక కుప్పకూలింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

శ్రీలంక చేతిలో ఓటమి

శ్రీలంక చేతిలో ఓటమి

గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆతిథ్య జట్టు మంగళవారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ మెగా టోర్నీలో మూడో ఓటమిని తన ఖాతాలో వేసుకుని సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ముఖ్యంగా ఆసీస్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో సోషల్ మీడియాలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లాండ్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ

ఇంగ్లాండ్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ

ఇంగ్లాండ్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ చేజింగ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. చేజింగ్‌లో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లను చేజార్చుకుందని మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరైతే ఇంగ్లాండ్‌కు ఛేజింగ్‌ చేత కాదంటూ తేల్చి చెప్పారు. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఇండియా, కివీస్ జట్లతో తలపడనుంది.

ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో

ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో

ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. అలాంటి జట్లపై ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.

64 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

64 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

అనంతరం 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 44.4 ఓవర్లలోనే 221 పరుగులకి ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకముందు మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లండ్‌ చతికిలపడింది. మలింగా దెబ్బకు 212 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Wednesday, June 26, 2019, 13:21 [IST]
Other articles published on Jun 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X