న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

77 ఆలౌట్: రోచ్ దెబ్బకు ఇంగ్లాండ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

England bowled out for their 4th lowest Test total vs West Indies

హైదరాబాద్: బార్బడోస్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఓ చెత్త రికార్డుని నమోదు చేసింది. వెస్టిండిస్ పేసర్ కీమర్‌ రోచ్‌ (5/17) అద్భుత ప్రదర్శనకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండిస్‌తో టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు కావడం విశేషం.

పాండ్యా, రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేతపై రెండుగా చీలిన క్రికెట్ ఫ్యాన్స్పాండ్యా, రాహుల్ సస్పెన్షన్ ఎత్తివేతపై రెండుగా చీలిన క్రికెట్ ఫ్యాన్స్

ఫలితంగా వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్‌ జట్టులో ఓపెనర్లు బర్న్స్‌ (2), జెన్నింగ్స్‌ (17), కెప్టెన్‌ రూట్‌ (4), బెయిర్‌ స్టో (12), స్టోక్స్‌ (0), మొయిన్‌ అలీ (0), బట్లర్‌ (4), ఫోక్స్‌ (2) ఇలా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

ఒక దశలో 35/1తో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్‌ వెస్టిండిస్ బౌలర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. విండిస్ బౌలర్ కీమర్ రోచ్‌ 31 బంతుల వ్యవధిలో 9 పరుగులిచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ జట్టు 289 పరుగులకు ఆలౌటైంది.

వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లలో హెట్ మెయిర్ (81) టాప్ స్కోరర్‌గా నిలవగా, షై హోప్‌ (57), చేజ్‌ (54) హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆతిథ్య జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌ ఐదు వికెట్లు తీయగా, బెన్ స్టోక్స్‌‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, January 25, 2019, 13:05 [IST]
Other articles published on Jan 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X