న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Devon Conway: క్రికెట్ కోసం ఆస్తులు అమ్ముకున్నాడు..గోడలా మారాడు: లైఫ్ స్టోరీ ఇదీ: ఏబీ ఫిదా

 ENG vs NZ 1st test: Ab De Villiers impressed on Devon Conways life story
Devon Conway Untold Story రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన స్టార్ ABD Shares Life Story|Oneindia Telugu

లండన్: డెవాన్ కాన్వే.. అందర్జాతీయ క్రికెట్‌లో రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన స్టార్. ఇప్పుడితని పేరు ప్రపంచ క్రికెట్‌లో మార్మోగుతోంది. టెస్ట్ మ్యాచ్ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్. కాన్వే బ్యాటింగ్ శైలి.. ఇంగ్లాండ్ క్రికెటర్లకు కొరుకుడు పడలేదు. అతణ్ని పెవిలియన్ దారి పట్టించలేకపోయారు. సరిగ్గా 200 పరుగులు చేసిన తరువాత.. డెవాన్ రనౌట్ అయ్యాడే తప్ప.. ఇంగ్లాండ్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. జట్టు మొత్తం చేసిన పరుగుల్లో 50 శాతానికి పైగా రన్స్.. అతనొక్కడే చేశాడు.

WTC final: గిట్లయితే ఎట్ల కేన్ మామ: జర మంచిగ ఆడరాదెWTC final: గిట్లయితే ఎట్ల కేన్ మామ: జర మంచిగ ఆడరాదె

 సిక్స్‌తో డబుల్..

సిక్స్‌తో డబుల్..

క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 200 పరుగులు చేశాడు. తొలిమ్యాచ్‌లోనే రికార్డుల మోత మోగించాడు. 194 పరుగుల వద్ద ఉన్న సమయంలో సిక్స్ కొట్టి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం.. అతని గట్స్‌కు అద్దం పట్టింది. అతని ఇన్నింగ్స్ మొత్తం మీద కొట్టిన సిక్స్ అదొక్కటే. ఈ క్రమంలో కొన్ని అరుదైన రికార్డులను నెలకొల్పాడు కాన్వే.

 దక్షిణాఫ్రికాను వీడి..

దక్షిణాఫ్రికాను వీడి..

క్రికెట్ అంటే అమితంగా ప్రేమించే డెవాన్ కాన్వే.. ట్రైనింగ్ కోసం ఆస్తులను అమ్ముకున్నాడు. జన్మతః అతను దక్షిణాఫ్రికన్. 2017 మార్చిలో జొహాన్నెస్‌బర్గ్‌ వాండెరర్స్‌లో తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్ తరఫున ఆడిన చివరి మ్యాచ్ అదే. అదే ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాను వీడాడు. న్యూజిలాండ్‌ బాట పట్టాడు. వెల్లింగ్టన్‌లో సెటిల్ అయ్యాడు. అక్కడా తన క్రికెట్ కేరీర్‌ను కొనసాగించడాడు. విక్టోరియా యూనివర్శిటీ క్రికెట్ క్లబ్ కోచ్‌గా, బ్యాట్స్‌మెన్‌గా డబుల్ రోల్ చేశాడు.

 ది వాల్‌గా..

ది వాల్‌గా..

కొత్తగా జీవితాన్ని ఆరంభించడానికి ఆస్తులను అమ్ముకున్నాడు. సుదీర్ఘకాలం పాటు క్రికెట్‌‌ను కొనసాగించాలనే కారణంతో ఇల్లు, వాకిలి, కారు.. అన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బులను క్రికెట్‌పై ధారపోశాడు. క్రమంగా కుదురుకున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బ్లాక్ క్యాప్‌ను ధరించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి బౌలర్ల ధాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. ది వాల్‌ అనిపించుకున్నాడు.

 50 శాతం పరుగులు అతనివే..

50 శాతం పరుగులు అతనివే..

ఒకవంక జట్టు కుప్పకూలిపోతోన్నప్పటికీ.. మొక్కవోని ధైర్యంతో క్రీజ్‌లో పాతుకుపోయాడు. జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడ్డాడు. తొలి ఇన్నింగ్‌లో న్యూజిలాండ్ జట్టు మొత్తం 378 పరుగులు చేయగా.. అందులో సగానికి పైగా స్కోరును కాన్వే ఒక్కడే సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతనికి దాసోహం అయ్యాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. శిఖర్ ధవన్ సాధించిన 187 పరుగుల రికార్డును తుడిచిపెట్టాడు.

మిస్టర్ 360 డిగ్రీన్ ఫిదా..

మిస్టర్ 360 డిగ్రీన్ ఫిదా..

డెవాన్ కాన్వే బ్యాటింగ్ పట్ల దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్, మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మరోో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. 2020లో డెవాన్ కాన్వే.. తన లైఫ్ స్టోరీని వినిపిస్తూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన కథనాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రతికూల పరిస్థితులు, కఠిన వాతావరణాన్ని ఎదుర్కొని నిల్చున్న కాన్వే సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడని పేర్కొన్నాడు.

Story first published: Friday, June 4, 2021, 11:58 [IST]
Other articles published on Jun 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X