న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ

Ellyse Perry becomes first player ever to reach 1000 runs, 100 wickets in T20Is

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ ఎల్లీస్‌ పెర్రీ అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డుని సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లతో పాటు వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ ఇంతవరకు ఈ ఘనతను ఏ క్రికెటరూ సాధించ పోవడం విశేషం.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

రెండో టీ20లో పెర్రీ అరుదైన ఘనతను

రెండో టీ20లో పెర్రీ అరుదైన ఘనతను

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో పెర్రీ ఈ ఘనతను సాధించారు. కాగా, గత నవంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో నటెల్లీ స్కీవర్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా ఎల్లీస్ పెర్రీ టీ20ల్లో తన వందో వికెట్‌ను సాధించింది. తాజాగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని

టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని

దీంతో అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా తరుపున టీ20ల్లో వెయ్యి పరుుగులు సాధించిన ఐదో మహిళ బ్యాట్స్‌మన్‌గా పెర్రీ నిలిచింది. పెర్రీకి ముందు మెగ్ లానింగ్, ఎల్సీ విల్లానీ, ఆలేసా హెలీ, అలెక్స్ బ్లాక్‌వెల్‌లు ఈ ఘనత సాధించారు.

టీ20 కెరీర్‌లో 1498 పరుగులతో పాటు 98 వికెట్లు

టీ20 కెరీర్‌లో 1498 పరుగులతో పాటు 98 వికెట్లు

అంతకముందు పాకిస్తాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 1498 పరుగులు సాధించగా, 98 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇప్పటికే యాషెస్ టెస్టు సిరిస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మూడో వన్డేలో ఏడు వికెట్లు తీసిన పెర్రీ

మూడో వన్డేలో ఏడు వికెట్లు తీసిన పెర్రీ

అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పెర్రీ ఏడు వికెట్లు సాధించారు. తద్వారా వన్డేల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన తొలి ఆసీస్‌ మహిళా క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్‌ జరుగుతుంది. ఇందులో తొలి రెండు టీ20ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టీ20 బుధవారం జరుగనుంది.

Story first published: Monday, July 29, 2019, 13:43 [IST]
Other articles published on Jul 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X