న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టులో కోహ్లీసేన ఓటమికి ఐదు కారణాలు

By Nageshwara Rao
Five Reasons Behind The Loss of Team India
Edgbaston Test: Five reasons behind Team Indias loss

హైదరాబాద్: కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం... మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులతో నాలుగో రోజు ప్రారంభించిన భారత్.. కోహ్లీ క్రీజులో ఉండటంతో విజయంపై ధీమాగా ఉంది.

అయితే, శనివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్‌నైట్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(20) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, హాఫ్ సెంచరీ పూర్తి చేశాక మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు, కోహ్లీ(51) ఎల్బీగా వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. దీంతో తొలి టెస్టులో గెలిచే సువర్ణావకాశాన్ని భారత్ కోల్పోయింది.

ముఖ్యంగా నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. అయితే, ఆతిథ్య ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో హాఫ్ సెంచరీ సాధించిన కుర్రాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.

1
42374

భారత్ ఓటమికి ఐదు కారణాలు:

  1. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 పరుగులు చేసిన కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ 40 పరుగులైనా చేయకపోవడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.
  2. ఇక, విదేశాల్లో మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్న రహానే సైతం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ త్వరగా పెవిలియన్ చేరాడు.
  3. పుజారా స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయాడు. పుజారాను పక్కబెట్టాలనే కోహ్లీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  4. అంతేకాదు కోహ్లీ పదే పదే జట్టులో, బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేస్తున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్‌ను మార్చకుండా ఉంచితే మెరుగైన ఫలితం రాబట్టే అవకాశం ఉంది.
  5. స్లిప్‌లో ఫీల్డర్లు క్యాచ్‌లను జారవిడవడం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. ధావన్ ఇచ్చిన లైఫ్‌తో బతికిపోయిన కుర్రాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్‌ పోరాడేగలిగే స్కోరు నమోదు చేసింది. లేదంటే తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసేదే.
Story first published: Sunday, August 5, 2018, 16:41 [IST]
Other articles published on Aug 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X