న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌కు ముప్పు? వంద బంతుల మరో చిట్టి క్రికెట్ లీగ్ తెరపైకి..

 ECB unveils plans for tournament with 100-ball format and 10-ball special over

హైదరాబాద్: ఆరంభం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక కొత్త ఫార్మాట్‌లు ఎన్నో తెరపైకి వచ్చాయి. టెస్టులు.. వన్డేలు.. ట్వంటీ20 క్రికెట్.. టీ10 క్రికెట్‌లను ఇప్పటికే చూశాం. క్రికెట్‌కి పుట్టినిల్లైన ఇంగ్లండ్ కొత్త విధానాన్ని తీసుకురానుంది. 2003లో ఇంగ్లండ్ కౌంటీల్లోకి 20-20 క్రికెట్‌ను ప్రవేశపెట్టింది.

ప్రపంచ క్రికెట్లో పొట్టి క్రికెట్‌కు ఊహించని స్థాయిలో అసాధారణ ఆదరణ లభించింది. తాజాగా మరో కొత్త ఫార్మాట్ ఇన్నింగ్స్‌లో 100 బంతులతో క్రికెట్ ఆడేలా నూతన ప్రతిపాదనలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెరపైకి తీసుకొచ్చింది.

 క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ:

క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ:

ఈసీబీ చేసిన ప్రతిపాదన క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్‌ను తమ దేశీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది.

మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్‌:

మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్‌:

ఈ ఫార్మాట్‌లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు.. 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌తో మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్‌ చేస్తున్నామని బోర్డు తెలిపింది. ఈ ప్లాన్‌ గనుక కార్యరూపం దాల్చితే 2020 ఏడాది నుంచి నూతన ఫార్మాట్‌ను చూడొచ్చని పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇప్పుడు ట్విటర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని దేశవాళీ క్రికెట్‌లో ముందుగా ఈ నూతన ఫార్మాట్‌ను ప్రయోగాత్మకంగా మొదలెట్టాలని భావిస్తున్నారు.

40 బంతులు తక్కువగా :

40 బంతులు తక్కువగా :

ఈ కొత్త టోర్నమెంట్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో 40 బంతులు తక్కువగా వేస్తారు. దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. బంతులు తక్కువగా ఉండటంతో ఆటగాళ్లు వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతాయి. దీంతో సాయంత్రం సమయాల్లో జరిగే ఈ మ్యాచ్‌లకు యువతీ యువకులతో పాటు వారి కుటుంబసభ్యులను ఆకర్షించేందుకు వీలవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

 ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌:

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌:

దీనిపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ స్పందిస్తూ.. ‘క్రికెట్‌లో ఇప్పుడు 5, 4, 3, 2 రోజుల క్రికెట్‌, 50, 40, 20, 10 ఓవర్లు, హాంగ్‌ సిక్సెస్‌ల అంటూ చాలా ఫార్మాట్‌లలో క్రికెట్‌ కొనసాగుతోంది. ఇప్పుడు 100 బంతుల క్రికెట్‌.. మన గొప్ప ఆటను అర్థం చేసుకునేందుకు గుడ్‌లక్‌..' అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ‘ఈసీబీ కొత్త ఫార్మాట్‌ ఐపీఎల్‌ను పాతిపెడుతుంది' అంటూ గార్డియన్‌ రైటర్‌ బెర్నే భిన్నంగా స్పందించాడు.

Story first published: Friday, April 20, 2018, 17:37 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X