న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే కేవ‌లం జ‌ట్టే కాదు.. ఒక కుటుంబం లాంటిది: బ్రావో

Dwayne Bravo says CSK makes you feel that you are part of an extended family
Chennai Super Kings Is Like My Family - Bravo | KL Rahul Donation For Children

ఆంటిగ్వా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) జట్టు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో.. ఆ జట్టుపై, కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఒక కుటుంబం లాంటిద‌ని పేర్కొన్నాడు. లీగ్ సంద‌ర్భంగా ధోనీ, కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ త‌న‌పై పూర్తి విశ్వాసం ఉంచుతార‌ని ఈ విండీస్ ప్లేయ‌ర్ చెప్పుకొచ్చాడు. త‌న‌పై ఉన్న న‌మ్మ‌కం కార‌ణంగానే డెత్ ఓవ‌ర్స్‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఇస్తున్నార‌ని తెలిపాడు.

టీ20ల్లో చెత్త రికార్డు.. 14 ఏళ్లుగా ధోనీదే అగ్రస్థానం!!టీ20ల్లో చెత్త రికార్డు.. 14 ఏళ్లుగా ధోనీదే అగ్రస్థానం!!

సీఎస్‌కే కేవ‌లం జ‌ట్టే కాదు:

సీఎస్‌కే కేవ‌లం జ‌ట్టే కాదు:

లాక్‌డౌన్ నేపథ్యంలో సీఎస్‌కేతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్న డ్వేన్ బ్రేవో మాట్లాడుతూ... 'చెన్నై సూప‌ర్ కింగ్స్ కేవ‌లం జ‌ట్టే కాదు. అది ఒక కుటుంబం లాంటిది. చెన్నై త‌ర‌ఫున చాన్నాళ్లుగా ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు ఈ విష‌యం బాగా తెలిసి ఉంటుంది. ఆ టీమ్‌లో చేరిన ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు. నేను వేరే ఫ్రాంచైజీలో కూడా ఆడాను. కానీ.. నాకు ఇక్కడ ఎంతో మద్దతు లభించింది' అని అన్నాడు.

ధోనీ, ఫ్లెమింగ్‌ మద్దతు మరువలేనిది:

ధోనీ, ఫ్లెమింగ్‌ మద్దతు మరువలేనిది:

ఎంఎస్ ధోనీకి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌కి తనపై ఎంతో నమ్మకం ఉంటుందని బ్రావో పేర్కొన్నాడు. 'ధోనీ, ఫ్లెమింగ్‌ ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్‌ చేసి బాగా పరుగులు ఇచ్చినా లేక సాధారణంగా పరుగులు ఇచ్చినా.. వాళ్లు నాతో ఒకే విధంగా ఉంటారు. కొన్ని సార్లు విఫ‌ల‌మైనా డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఇచ్చారు. డెత్ ఓవర్లలో నా ప్రతిభను సీఎస్‌కే వెలికి తీసింది. బలమైన ఆటగాళ్లకి వ్యతిరేకంగా ఆడటం అంత సులభం కాదు. కానీ నేను నా ప్రతిభని నమ్ముకొని ఉంటాను' అని బ్రావో పేర్కొన్నాడు.

రాయుడిని ఆట‌ప‌ట్టించేవాడిని:

రాయుడిని ఆట‌ప‌ట్టించేవాడిని:

'నాకిష్ట‌మైన భార‌త ఆట‌గాళ్ల‌లో అంబ‌టి రాయుడు ఒక‌డు. ఇంత‌కుముందు ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున కూడా మేమిద్ద‌రం క‌లిసే ఆడాం. అత‌డికి కాస్త కోపం ఎక్కువ‌. అందుకే త‌ర‌చూ అత‌డిని రెచ్చ‌గొట్టేవాడిని. నువ్వు మంచి ఆట‌గాడివి కాదు. నీకు బ్యాటింగే రాదు. అస‌లు చెన్నై నిన్నేందుకు కొనుగోలు చేసిందో.. అంటో అత‌డిని ఆట‌ప‌ట్టించేవాడిని. నా మాట‌లు అబద్ధాల‌ని నిరూపించేందుకు అత‌డు మైదానంలో వంద శాతం కృషిచేసేవాడు. అలా అత‌డు రాణించిన ప్ర‌తీసారి నేను చాలా ఆనంద‌ప‌డేవాడిని' అని విండీస్ ఆల్‌రౌండర్‌ చెప్పుకొచ్చాడు.

రిటైర్మెంట్‌ వెనక్కు:

రిటైర్మెంట్‌ వెనక్కు:

2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్‌'ని కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

Story first published: Monday, April 20, 2020, 21:48 [IST]
Other articles published on Apr 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X