'లార్డ్స్ టెస్టులోనే అనుకున్నా, నా నిర్ణయం సరైనదే'

Posted By:

హైదరాబాద్: దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని మాజీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జేపీ డుమినీ అభిప్రాయపడ్డాడు. టెస్టు ఫార్మెట్‌కు ముందుకు తక్కువ స్కోర్లకే పరిమితమవుతూ వస్తున్న తరుణంలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన చర్యగానే డుమినీ స్పష్టం చేశాడు.

'లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ (సెప్టెంబర్ 26) తరువాత మైదానం నుంచి నడుచుకుంటూ వస్తున్న తరుణంలో నా టెస్టు కెరీర్‌లో ఏదొకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని లార్డ్స్ టెస్టులోనే అనుకున్నా. నా నిర్ణయం సరైనదే' అని డుమినీ పేర్కొన్నాడు.

Duminy says he deserved to be dropped

'చాలా మంది యువ క్రికెటర్లు సఫారీ జట్టు తరుపున అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో చెప్పడంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌పై సీరియస్‌గా దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది' అని జేపీ డుమినీ తెలిపాడు. ఇటీవలే జేపీ డుమినీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

వీడ్కోలు సమయంలో టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణించకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుమినీ చెప్పాడు. దక్షిణాఫ్రికా తరుపున 46 టెస్టు మ్యాచ్‌లాడిన డుమినీ 2,103 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన బౌలింగ్ ద్వారా టెస్టుల్లో 42 వికెట్లు తీశాడు.

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డుమినీ చివరిసారి కనిపించారు. ఇదిలా ఉంటే 2019 వరల్డ్ కప్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు జేపీ డుమినీ వీడ్కోలు చెప్పడం విశేషం.

Story first published: Thursday, October 12, 2017, 15:56 [IST]
Other articles published on Oct 12, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి