న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల నుంచి ధోనీని అందుకే తప్పించారా??

Dropped not rested: Selectors tell MS Dhoni his T20I career is over

హైదరాబాద్: విశ్రాంతి అంటున్నప్పటికీ ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనిని వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ల నుంచి తప్పించింది. మరో నాణ్యమైన వికెట్‌కీపర్‌ అన్వేషణలో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నప్పటికీ.. అది మహి టీ20 కెరీర్‌ను ప్రశ్నార్థకం చేయడమే కాదు.. వన్డే కెరీర్‌నూ ప్రమాదంలో పడేసింది.

వ్యూహాలు రచించడంలో దిట్ట అయినప్పటికీ

వ్యూహాలు రచించడంలో దిట్ట అయినప్పటికీ

వెస్టిండీస్‌పై భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ తడబాటు వరుసగా మూడో వన్డేలోనూ కొనసాగింది. పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న ధోని చేసింది 7 పరుగులే. ఇందులో కనీసం ఒక్క బౌండరీ కూడా లేదు. మైదానంలో వ్యూహాలు రచించడంలో దిట్ట అయినప్పటికీ అతని పేలవ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ధోనీ.. వన్డే కెరీర్‌ని కూడా తాజా సిరీస్‌‌లో పేలవంగా

ధోనీ.. వన్డే కెరీర్‌ని కూడా తాజా సిరీస్‌‌లో పేలవంగా

284 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ జట్టు 172/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని.. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఒక ఎండ్‌లో విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నా.. ధోనీ మాత్రం ఔటయ్యే వరకూ గేర్ మార్చలేకపోయాడు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన ధోనీ.. వన్డే కెరీర్‌ని కూడా తాజా సిరీస్‌‌లో పేలవ ప్రదర్శనతో ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.

తంటాలు పడుతుండటం సెలక్టర్లకి మింగుడుపడక

తంటాలు పడుతుండటం సెలక్టర్లకి మింగుడుపడక

2018లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోని చేసింది 252 పరుగులు మాత్రమే. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా.. ధోనీ 27 పరుగులు మాత్రమే చేశాడు. 2019 ప్రపంచకప్‌కి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండగా.. ధోనీ ఇంకా ఫామ్‌ కోసం తంటాలు పడుతుండటం సెలక్టర్లకి మింగుడుపడటం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల టీ20 జట్టు నుంచి తప్పించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

వన్డే సిరీస్‌కి ధోనీ ఎంపికవ్వాలంటే..

వన్డే సిరీస్‌కి ధోనీ ఎంపికవ్వాలంటే..

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ధోనీ ఎంపికవ్వాలంటే.. వెస్టిండీస్‌తో మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు రాణించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్లు కనిపిస్తుండటంతో సెలక్టర్లు కూడా ధోనీపై సాహసోపేత నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడటం లేదు. భారత్, వెస్టిండీస్ మధ్య బ్రబౌర్న్ స్టేడియం(ముంబై)లో సోమవారం నాలుగో వన్డే జరగనుంది.

Story first published: Sunday, October 28, 2018, 15:54 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X