న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా జట్టులో ఫించ్ మాత్రం ఉండడు: స్టీవ్ వా

Drop Aaron Finch, open with Marcus Harris and Shaun Marsh: Steve Waugh

సిడ్నీ: రెండు పరాజయాల అనంతరం టీమిండియాతో నాలుగో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత్‌‌తో సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టు మ్యాచ్ నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ని తప్పించాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా సూచించాడు. సిరీస్‌లో ఇప్పటికే 3 టెస్టులు ముగియగా.. కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా ఫించ్ సాధించలేకపోయాడు. ఆరంభ ఓవర్లలోనే వికెట్ చేజార్చుకుంటున్న ఈ ఓపెనర్.. సిరీస్‌లో కేవలం 16 సగటుతో నిలవడం అతని పేలవ ఫామ్‌కి నిదర్శనం. మెల్‌బౌర్న్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.

షాన్ మార్ష్‌తో ఓపెనింగ్ చేయించాలని

షాన్ మార్ష్‌తో ఓపెనింగ్ చేయించాలని

ఈ నేపథ్యంలో సిడ్నీ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్‌కు జట్టును సూచిస్తూ పదకొండు మందితో కూడిన జాబితాను సూచించాడు. వా కు మార్కస్ హారిస్, వెటరన్ ప్లేయర్ షాన్ మార్ష్‌లు కూడా మద్ధతు తెలియజేశారు. సిడ్నీ టెస్టు నుంచి ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ని తప్పించి అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్‌తో ఓపెనింగ్ చేయించాలని స్టీవ్‌ వా.. ఆస్ట్రేలియా జట్టుకి సూచించాడు. ఇక షాన్ మార్ష్ ఆడుతున్న 4వ స్థానంలో ట్రావిస్ హెడ్‌ని ఆడించాలని.. అతని తర్వాత కెప్టెన్ టిమ్‌పైన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక స్థానం ముందుకొస్తే మంచిదని స్టీవ్‌ వా అభిప్రాయపడ్డాడు.

ఫించ్‌ను తప్పించడం సరైనదేనని

ఫించ్‌ను తప్పించడం సరైనదేనని

ఇక ఫించ్‌ స్థానంలో తుది జట్టులోకి యువ ఆల్‌రౌండర్ మార్నస్‌‌కి చోటిస్తే జట్టులో సమతూకం ఏర్పడుతుందని సూచించిన ఈ దిగ్గజ క్రికెటర్.. హారిస్, షాన్ మార్ష్ ఓపెనింగ్ జోడీ సత్తాచాటగలదని ధీమా వ్యక్తం చేశాడు. తాను కొత్త స్పిన్నర్ లాబుంచాగ్నే ఆట తీరును గమనించానని అతను రావాలంటే ఫించ్‌ను తప్పించడం సరైనదేనని దాంతో పాటు ఉస్మాన్ ఓపెనింగ్ దించినా పరవాలేదంటూ అభిప్రాయపడ్డాడు.

మయాంక్‌తో ఓపెనింగ్ చేయించాలని

మయాంక్‌తో ఓపెనింగ్ చేయించాలని

పెర్త్ పరాజయం అనంతరం భారత జట్టులోనూ మూడో టెస్టుకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌పై వేటు పడింది. వారి స్థానంలో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారిని మెల్‌బోర్న్ టెస్టులో ఆడారు. అయితే వారిలో కేవలం మయాంక్ మాత్రమే విలువైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Story first published: Monday, December 31, 2018, 15:17 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X