న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సచిన్, మోడీల పొగడ్తలు మాకేం అవసరం లేదు'

Don’t want Sachin Tendulkar, PM Modi’s wishes, say emotional blind cricket World Cup heroes

హైదరాబాద్: అంధుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతలు కప్ గెలుచుకున్న ఆనందంతో మంగళవారం కన్నాట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఢిల్లీలో కురుస్తున్న వర్షాన్ని అన్వయిస్తూ చాలా కాలం తర్వాత ఢిల్లీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అని క్రికెట్ జట్టులో సభ్యుడైన మహేంద్ర వైష్ణవ్ అన్నాడు.

సెంట్రల్ పార్క్‌లో జరిగిన గెలుపు సంబరాల అనంతరం వారు పాటలు పాడుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అజయ్ రెడ్డి నేతృత్వంలో భారత జట్టు పాకిస్థాన్ జట్టును ఓడించింది. ఈ ప్రేరణతో అంధుల క్రికెట్ ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది.

ట్వీట్లతో వచ్చేదేం లేదు:
'మాకు మీరు పంపే ట్వీట్‌లు అక్కరలేదు. సహాయం కావాలి. అంటూ భారత అంధుల క్రికెట్ కెప్టెన్ మండిపడ్డాడు. పాకిస్థాన్ అంధుల క్రికెట్ జట్టుకు ఆ దేశం నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. వాళ్లకంటూ ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను కేటాయించారు. 2002లో వారు ప్రపంచ కప్‌ను గెలిచినప్పుడు అధికారికమైన గుర్తింపును తెచ్చుకున్నారు. వారికి రెగ్యూలర్ జీతాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక బహుమతులంటూ ఎన్ని సౌకర్యాలను అందిపుచ్చుకుంటున్నారు. వాళ్లు కేవలం రెండు ప్రపంచ కప్‌లనే గెలుచుకున్నారు. కానీ మేం ఇప్పటికీ ఐదు ప్రపంచ కప్‌లను గెలుచుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ' వాపోయాడు.

'మాకు అభినందనలు తెలుపుతూ మీరు పంపే సందేశాలు ఎందుకు ఉపయోగపడవు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ మెసేజ్ చేశారు. అవి మాకెందుకు..? మాకు కావాల్సింది ప్రోత్సాహం. ట్వీట్లు కాదు' అని అజయ్ రెడ్డి ప్రాధేయపడ్డాడు.

సమావేశాన్ని ముగిస్తూ తాము గెలిచిన విజయాన్ని సరిహద్దుల్లో ఉండే భారత సైనికులకు అంకితం చేస్తున్నట్లు కెప్టెన్ పేర్కొన్నాడు. మేము క్రికెట్ ఆడటం ఎప్పటికీ మానెయ్యమంటూ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 12:42 [IST]
Other articles published on Jan 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X