న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సెహ్వాగ్‌తో పోల్చకండి, అతనో ఓ దిగ్గజ ఆటగాడు'

By Nageshwara Rao
Mayank Agarwal

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చవద్దని ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌గా అరుదైన రికార్డు సృష్టించిన మయాంక్‌ అగర్వాల్‌ అన్నాడు. కర్ణాటకకు చెందిన మయాంక అగర్వాల్ విజయ్‌ హజారే టోర్నీలోనే మొత్తం 723 పరుగులు సాధించాడు.

కెరీర్‌తో పాటు ప్రేమలో కూడా విజయం సాధించా: మయాంక అగర్వాల్కెరీర్‌తో పాటు ప్రేమలో కూడా విజయం సాధించా: మయాంక అగర్వాల్

దీంతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో వరుసగా వరుసగా 109, 84, 28, 102, 89, 140, 81, 90 పరుగుల వరద పారించాడు. దీంతో అందరూ అతన్ని సెహ్వాగ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. దీనిపై తాజాగా మయాంక అగర్వాల్ స్పందించాడు.

'ఒకరితో పోల్చుకునే స్థాయికి నేను ఇంకా రాలేదు. దయచేసి నన్ను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చకండి. సెహ్వాగ్‌ ఓ దిగ్గజ ఆటగాడు. నన్ను అతనితో పోల్చడం సరికాదు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో నేను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అదృష్టవశాత్తూ ఇదే ఫ్రాంఛైజీకి సెహ్వాగ్‌ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు' అని మయాంక్‌ తెలిపాడు.

'కాబట్టి అతడి నుంచి నేను విలువైన సలహాలు పొందుతాను. సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేసే తీరు చూడటం అంటే నాకు చాలా ఇష్టం. స్పిన్నర్లను ఎదుర్కొనే శైలి నాకు ఇంకా బాగా నచ్చుతుంది. మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి, గేమ్‌ను ఎలా ఎంజాయ్‌ చేయాలో సెహ్వాగ్‌ నుంచి నేర్చుకుంటా. భవిష్యత్తులో ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపాడు.

ఈ సీజన్‌లో 2,141 పరుగులు చేయడంతో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. అతను 2015-16 సీజన్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఆ రికార్డ్‌ని మయాంక్ అగర్వాల్ అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ సీజన్‌లో మయాంక అగర్వాల్ అన్ని ఫార్మాట్లు కలిసి 2,141 పరుగులు నమోదు చేశాడు. మూడో స్థానంలో వసీం జాఫర్ ఉన్నాడు. అతను 2008-2009 సీజన్‌లో 1,907 పరుగులు చేశాడు.

Story first published: Sunday, March 4, 2018, 9:00 [IST]
Other articles published on Mar 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X