న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషబ్ పంత్‌కు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇచ్చిన సలహా ఇదే!

Gilchrist To Rishabh Pant : Don't Try To Be M.S. Dhoni || Oneindia Telugu
Dont try to be Dhoni, learn everything you can from him: Gilchrists advice to Pant

హైదరాబాద్: ధోనిలా ఉండేందుకు ప్రయత్నించవద్దని, అతడి నుంచి ప్రతిదాన్ని నేర్చుకోవాలని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ సూచించాడు. అంతేకాదు భారత అభిమానులు పంత్‌ను ధోనితో పోల్చకుండా ఉండాలని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా టూరిజం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆడమ్ గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ "నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పోలికలపై మాట్లాడను. భారతీయుల అభిమానులు అతన్ని ధోనితో పోల్చకూడదనేది నా అభిప్రాయం. అంతటి బెంచ్ మార్కుని ధోని సృష్టించాడు. ఏదో ఒకరోజు ఎవరైనా దానిని అందుకోవచ్చు. కానీ, అది అసంభవం" అని అన్నాడు.

<strong>అసలేం జరిగింది! కోహ్లీ పుట్టినరోజు నాడు రవి శాస్త్రిని ట్రోల్ చేసిన అభిమానులు</strong>అసలేం జరిగింది! కోహ్లీ పుట్టినరోజు నాడు రవి శాస్త్రిని ట్రోల్ చేసిన అభిమానులు

పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు

పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు

"రిషబ్ పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. అప్ఫుడే అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. రాబోయే రోజుల్లో ప్రతిరోజూ అతడు ధోని తరహా ప్రదర్శనలు ఇస్తాడని ఆశించండి" అని ఆడమ్ గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. ఈ సందర్భంలో రిషబ్ పంత్‌కు గిల్ క్రిస్ట్ ఓ సలహా కూడా ఇచ్చాడు.

పంత్‌కు నా సలహా ఇదే

పంత్‌కు నా సలహా ఇదే

"రిషబ్ పంత్‌కు నా సలహా ఇదే: ధోని నుండి నువ్వు ఏం నేర్చుకోగలవో నేర్చుకో. ధోనిగా ఉండటానికి మాత్రం ప్రయత్నించవద్దు. నువ్వు రిషబ్ పంత్‌గా మాదిరే ఉండేందుకు ప్రయత్నించు" అని అన్నాడు. కాగా, ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో డీఆర్ఎస్‌ను అంచనా వేయడంలో ఫంత్ విఫలమైన సంగతి తెలిసిందే.

తొలి టీ20లో విఫలం

తొలి టీ20లో విఫలం

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్యసర్కార్‌(20) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో ఓ బంతి సౌమ్య సర్కార్ బ్యాట్‌కు తాకకుండానే వెళ్లి నేరుగా వికెట్ కీపర్ పంత్‌ చేతుల్లో పడింది. దీంతో బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడని భావించిన పంత్‌.. అంపైర్‌ ఔటివ్వకపోయినా రోహిత్‌శర్మను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు.

పంత్‌పై మండిపడ్డ నెటిజన్లు

రివ్యూలో సౌమ్యసర్కార్‌ బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో టీమిండియా రివ్యూ వృథా అయింది. పంత్ అంచనా తప్పవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చేసేదేమీ లేక నవ్వుకున్నాడు. డీఆర్ఎస్‌పై పంత్ అవగాహన లేకుండా ఒక రివ్యూని అనవసరంగా వృథా చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు.

Story first published: Tuesday, November 5, 2019, 18:30 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X