న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు: యాంకర్‌కు పాక్ క్రికెటర్ వార్నింగ్

Dont Try To Cross Your Limits: Babar Azam Slams Anchor Zainab Abbas

హైదరాబాద్: 'నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు' అంటూ పాక్ యాంకర్, జర్నలిస్ట్‌ జైనాబ్‌ అబ్బాస్‌‌ను ఉద్దేశించి పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. యాంకర్‌కు పాక్ క్రికెటర్ ఇంతలా వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే....

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా దుబాయి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బాబర్‌ అజాం (127) సెంచరీ సాధించాడు. బాబర్ అజాంకు టెస్టుల్లో ఇది తొలి టెస్టు సెంచరీ. అతనితో పాటు మరో క్రికెటర్ హరీష్‌ సోహైల్‌ (148) కూడా సెంచరీతో రాణించడంతో పాక్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 418 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది.

హరీస్‌ సొహైల్‌ (147), బాబర్‌ ఆజమ్‌ (127) సెంచరీలతో రాణించడంతో ఓవర్‌నైట్‌ స్కోరు 207/4తో రెండో రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌ మరో 211 పరుగులు జోడించి 418/5 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 24/0 స్కోరు చేసింది.

కెరీర్‌లో తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన బాబర్‌ అజాంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ యాంకర్‌ జైనాబ్‌ అబ్బాస్‌, బాబర్‌ అజాను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ అతడి కోపానికి కారణమైంది. ఇంతకీ ఆ యాంకర్‌ తన ట్విట్టర్‌లో ఏమని ట్వీట్ చేసిందంటే "బాబర్‌ అజమ్‌ అద్భుతంగా ఆడాడు. మిక్కీ ఆర్థర్‌ తన కొడుకు సెంచరీని ఆస్వాదిస్తున్నాడు" అని ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్ బాబర్‌ అజాంకు కోపాన్ని తెప్పించింది. దీంతో వెంటనే తన ట్విట్టర్‌లో "ఎదైనా చెప్పాలనుకునే ముందు ఒకసారి ఆలోచించు. నీ హద్దులు దాటడానికి ప్రయత్నించొద్దు" అంటూ ఘాటుగా బదులిచ్చాడు. మిక్కీ అర్థర్‌ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు కోచ్‌గా వ్వవహారిస్తున్నారు.

ఇదే అతడి కోపానికి కారణమైంది. అయితే, జైనాబ్‌ అబ్బాస్ చేసిన ట్వీట్‌ను బాబర్‌ తప్పుగా అర్థం చేసుకున్నాడని కొందరు.. జైనాబ్‌ అబ్బాస్‌ది తప్పేనని సోషల్ మీడియాలో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో పాక్ ఓడిపోయింది.

Story first published: Monday, November 26, 2018, 15:33 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X