న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsSL: శ్రీలంక సిరీస్‌లో కోహ్లీ లేడు.. రెస్ట్ అడిగాడా? లేదంటే తీసేశారా?

 Does Virat Kohli dropped from T20 Squad

వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే జట్టులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆడటం లేదు. ఈ సిరీస్‌లో తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ అడిగినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సీనియర్లను టీ20 ఫార్మాట్ నుంచి తప్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందని కూడా గుసగుసలు వినిపించాయి.

 టీ20 టీంల నో కోహ్లీ

టీ20 టీంల నో కోహ్లీ

ఇలాంటి సమయంలో కోహ్లీని టీ20 జట్టు నుంచి తప్పించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన అతన్ని ఇలా సడెన్‌గా టీ20 ఫార్మాట్ నుంచి తప్పించడం ఏంటని నిలదీస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీనే. వీళ్లలో సూర్యకుమార్‌ను శ్రీలంక సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా నియమించగా.. కోహ్లీని జట్టులోకి తీసుకోలేదు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం కోహ్లీని ఎంపిక చేశారు.

 కోహ్లీనే రెస్ట్ అడిగాడా?

కోహ్లీనే రెస్ట్ అడిగాడా?

టీ20 బృందం నుంచి కోహ్లీని తప్పించడంపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. 'ఇలా కోహ్లీని టీ20 బృందం నుంచి తప్పించడంపై క్లారిటీ లేదు. దీనిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు కదా. కాబట్టి అతన్ని జట్టు నుంచి తొలగించారా? లేదా కోహ్లీనే విశ్రాంతి అడిగాడా? అనేది చెప్పలేం. అంత స్థాయి ఆటగాడిని జట్టులో నుంచి తొలగించారని అనడం కూడా కరెక్ట్ కాదు' అని రాజ్‌కుమార్ శర్మ అన్నాడు.

కోహ్లీనే తప్పుకున్నాడా?

కోహ్లీనే తప్పుకున్నాడా?

ఈసారి టీ20 జట్టు నుంచి కోహ్లీనే తప్పుకొని ఉంటాడని రాజ్‌కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. 'ఈ మధ్య కాలంలో ప్రధానమైన టీ20 టోర్నీ ఏం లేదు. వచ్చే వరల్డ్ కప్ కోసం చాలా టైం పట్టుద్ది. ఈ ఆటగాళ్లంతా బంగ్లాదేశ్‌లో టెస్టు మ్యాచులు ఆడారు. మళ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడతారు. మిగతా సీనియర్ ఆటగాళ్లు చాలా వరకు టీ20 బృందంలో లేకపోవడంతో విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతి ఇచ్చి ఉంటారు. వీళ్లకు విశ్రాంతినిచ్చి కుర్రాళ్లకు టీం మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లకు ఏం చెప్పకుండా వాళ్ల స్థానంలో వేరే వారిని ఎంపిక చేస్తారని నేను అనుకోవడం లేదు' అని వివరించాడు.

Story first published: Thursday, December 29, 2022, 19:07 [IST]
Other articles published on Dec 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X