న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘన్‌తో మ్యాచ్‌లో స్లో బ్యాటింగ్‌‌పై ధోనీని ఎవరైనా ప్రశ్నించారా?

ICC Cricket World Cup 2019: Bharat Arun Comments On MS Dhoni's Slow Batting!!
Does anyone speaking to Dhoni? Bharath Arun says Shastri has dialogue with all batsmen

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్ట్రైక్‌ రేట్‌ను విరాట్‌ కోహ్లీతో పోల్చొద్దని భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా గురువారం వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ధోని కెరీర్‌లోనే అత్యంత స్లోగా ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి. మరోవైపు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వేగంగా స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోవడంపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఈ విషయంపై అతడిని ప్రశ్నించారా అన్న దానికి అరుణ్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

భరత్ అరుణ్ మాట్లాడుతూ

భరత్ అరుణ్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ "బ్యాట్స్‌మెన్‌, సహాయ సిబ్బంది, బ్యాటింగ్‌ కోచ్‌, హెడ్ కోచ్‌ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అందరు కోచ్‌లతో రవిశాస్త్రి చర్చిస్తూనే ఉంటారు. ఆటగాళ్ల ప్రదర్శనపై మేం చర్చిస్తామో చెప్పను" అని అన్నాడు.

ఎలా మెరుగు అవ్వాలన్నదానిపై

ఎలా మెరుగు అవ్వాలన్నదానిపై

"మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మాత్రం, అవును ఇంకా ఎలా మెరుగు అవ్వాలన్న దానిపై బ్యాట్స్‌మెన్‌ అందరితోనూ శాస్త్రి మాట్లాడతారు" అని అన్నాడు. ఇక, ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేశాడని భరత్ అరుణ్‌ పేర్కొన్నాడు.

నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా

నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా

"పరిస్థితులు, వికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే మేం నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నాం. ధోనీ-జాదవ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న దశలో మేం వికెట్‌ చేజార్చుకొని ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. అందుకే ధోనీ బ్యాటింగ్‌పై ఆందోళన చెందడం సరికాదు" అని భరత్ అరుణ్ తెలిపాడు.

విండిస్‌తో మ్యాచ్‌లో పేసర్లు రాణిస్తారు

విండిస్‌తో మ్యాచ్‌లో పేసర్లు రాణిస్తారు

"ఇక వెస్టిండిస్‌తో మ్యాచ్‌లో మా పేసర్లు రాణిస్తారన్న నమ్మకం ఉంది. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లకు అదనపు బలాలున్నాయి. అవి మా బౌలర్లకు సవాల్‌గా నిలుస్తాయి. అయితే కరీబియన్లను ఎక్కువ సమయం క్రీజులో నిలవకుండా మా బౌలర్లు అడ్డుకుంటారు" అని అరుణ్‌ తెలిపాడు.

Story first published: Thursday, June 27, 2019, 13:08 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X