న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి!

By Nageshwara Rao
Discarded Indian cricketer Sreesanth to be part of Bigg Boss 12: Report

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్‌బాస్' ఒకటి. ఇప్పటివరకు 11 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న హిందీ 'బిగ్‌బాస్' త్వరలో మరో కొత్త సీజన్‌తో అలరించడానికి సిద్ధమైంది. ఈ బిగ్‌బాస్‌ షోలో ఓ క్రికెటర్‌ కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంటాడని వార్తలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

కోహ్లీని అన్‌ఫాలో చేసిన రోహిత్: ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నల వర్షంకోహ్లీని అన్‌ఫాలో చేసిన రోహిత్: ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నల వర్షం

ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరని అనుకుంటున్నారా? కేరళ పేసర్‌ శ్రీశాంత్‌. హిందీ వర్షన్‌లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌-12వ సీజన్‌ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో క్రికెటర్‌ శ్రీశాంత్‌ పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ విషయం ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే షో ప్రారంభమయ్యేంత వరకు ఆగాల్సిందే. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా శ్రీశాంత్ జైలు జీవితం కూడా గడిపాడు.

2005లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శ్రీశాంత్‌ 2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. టీమిండియా తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టుల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Thursday, September 6, 2018, 15:21 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X