న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వరల్డ్‌కప్‌ జట్టులో దినేశ్ కార్తీక్ తప్పకుండా ఫినిషర్ పాత్ర పోషిస్తాడు'

Simon Katich Says Dinesh Karthik Will Play Finisher Role In World Cup | Oneindia Telugu
 Dinesh Karthik will play finishers role for India as he is in World Cup mix: Simon Katich

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఫినిషర్ పాత్రకు న్యాయం చేసి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో దినేశ్ కార్తీక్ తప్పకుండా చోటు దక్కించుకుంటాడని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌కి చోటు కల్పించలేదు.

<strong>శ్రీశాంత్‌కు ఊరట: బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం కోర్టు</strong>శ్రీశాంత్‌కు ఊరట: బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీం కోర్టు

ఈ సిరిస్‌కు ధోనితో పాటు రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరంగా విఫలం కావడంతో మళ్లీ తెరపైకి దినేశ్ కార్తీక్ వచ్చింది. ఆసీస్‌తో వన్డే సిరిస్ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయబోయే రెండో వికెట్ కీపర్‌పై విరాట్ కోహ్లీ క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ సత్తా చాటాలని భావిస్తున్నాడు.

ముఖ్యంగా మిడిలార్డర్‌లో ధోని తర్వాత ఒత్తిడిని ఎదుర్కోగల ఆటగాడిగా దినేశ్ కార్తీక్‌కు పేరుంది. ఇప్పటికే టీమిండియా తరుపున అనేక మ్యాచ్‌లను ఫినిషర్‌గా విజయవంతంగా ముగించాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో వికెట్‌ కీపర్‌ పంత్‌కు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోవడంతో కార్తీక్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి.

"దినేశ్‌ కార్తీక్ అనుభవం ఉపయోగపడుతుంది. అతడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడు. ప్రతిభావంతులు చాలా మంది ఉండటంతో భారత సెలక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌కు అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తాడు. గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలో ఓడిపోవడం ఆసీస్‌కు బాధ కలిగించి ఉంటుంది. భారత్‌పై వన్డే సిరిస్ విజయానికి వారు అర్హులు" అని అన్నాడు.

Story first published: Friday, March 15, 2019, 14:17 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X