న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్యకు భరోసా: కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో పల్లికల్‌తో దినేశ్ కార్తీక్

IPL 11: KKR Skipper Dinesh Karthik Wishes Wife Dipika Pallikal Ahead Of CWG
Dinesh Karthik backs wife Dipika Pallikals gold quest in Commonwealth Games

హైదరాబాద్: ఏప్రిల్ 4వ తేదీ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడలకు భారత క్రీడాకారులంతా సిద్ధమైయ్యారు. నాలుగేళ్ల అనంతరం మళ్లీ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమైన దీపికా పల్లికల్‌కు తన భర్త దినేశ్ కార్తీక్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

సెలబ్రిటీ దంపతుల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల్లానే ఒక జంటైన దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్ కూడా జాతీయ స్థాయి ప్రాముఖ్యత చెందిన వారు. దీపికా పల్లికల్ స్క్వాష్ గేమ్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎన్నో పతకాలు సాధించారు. నాలుగేళ్ల క్రితం జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణాన్ని గెలుచుకున్నారు.

పూర్తిగా సన్నద్ధమైన తన భార్య కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొననున్న నేపథ్యంలో దినేశ్ కార్తీక్ ట్వీట్ ద్వారా ఇలా స్పందించాడు. 'నాలుగేళ్ల క్రితం ఇదే కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న దీపికాతో సంబరాల్లో పాల్గొన్నాను. మళ్లీ అంతే స్థాయిలో తీవ్రంగా శ్రమించి ఆమె బరిలోకి దిగనుంది. ఈ సారి కూడా స్వర్ణాన్ని గెలుస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ నాలుగేళ్లు ఇంటికి దూరంగా కఠోరంగా శ్రమించింది. అంతటి బిజీలో ఉండికూడా ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంది. ఈ రోజు నేనిలాంటి ఆటతీరును ప్రదర్శిస్తున్నానంటే కేవలం తన ప్రోత్సాహంతోనే.' అని పేర్కొన్నాడు.

ఇంకా.. 'ఆమెతో పాటుగా కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న ఇతర భారత క్రీడాకారులందరికీ గుడ్ లక్. మరో సారి దీపికాకు కూడా గుడ్ లక్.' అని తన భావాలను బయటపెట్టాడు. మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ దినేశ్ కార్తీక్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరపున ఆడనున్నాడు. గత సీజన్ వరకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్ స్థానంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలు వ్యవహరించనున్నాడు.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనుంది. కోహ్లీ నాయకత్వంలో ప్రాక్టీసుతో సన్నద్ధమవుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తొలి మ్యాచ్ ఏప్రిల్ 8 ఆదివారం ఆడనుంది.

Story first published: Tuesday, April 3, 2018, 13:34 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X