న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ ఓటమికి నన్ను బలిపశువుని చేశారు: కోచ్ పదవి నుంచి తప్పించడంపై ఆర్థర్

Mickey Arthur

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్‌గా తనను తప్పించడం తీవ్ర నిరాశ, బాధను కలిగించాయని తాజా మాజీ కోచ్‌ మికీ అర్థర్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ జట్టు ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఓటమిపై నివేదిక కోరుతూ వసీం ఆక్రమ్‌, మిస్బావుల్‌ హక్‌లతో కూడిన ఓ కమిటీని నియమించింది.

రెండు రోజుల క్రితం ఈ కమిటీకి మికీ అర్థర్‌ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) హెడ్ కోచ్‌ మికీ అర్థర్‌‌పై వేటు వేసింది. కోచ్ ఆర్థర్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌ను కూడా తొలగించింది. వీరి కాంట్రాక్టును రెన్యూవల్ చేయకూడదని నిర్ణయించిన పీసీబీ.. త్వరలో కొత్త కోచ్ కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మొదలుపెట్టనున్నది.

1st ODI: మ్యాచ్ డిటేల్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ గణాంకాలివే!1st ODI: మ్యాచ్ డిటేల్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ గణాంకాలివే!

కోచ్ ఆర్థర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లావర్‌, బౌలింగ్ కోచ్ అజర్ మొహ్మద్‌, ట్రైనర్ గ్రాంట్ లూడెన్ స్థానాల్లో కొత్త వారిని తీసుకోనున్నారు. దీంతో ఆర్థర్‌ దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. అయితే, తనను హెడ్ కోచ్‌గా తప్పించడంపై మికీ అర్థర్‌ మాట్లాడుతూ "కోచ్‌గా పాకిస్థాన్ జట్టును నా భుజస్కంధాలపై మోశాను. కష్టకాలంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపాను. జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాను" అని అన్నాడు.

"జట్టుని విజయాల బాట పట్టించాను. యువ ఆటగాళ్లకు అండగా నిలిచాను. అయితే నా కోచ్‌ కాంట్రాక్టు ముగుస్తుండటంతో మరో రెండేళ్లు పొడగించమని కోరాను. కానీ వాళ్లు ప్రపంచకప్‌ ఓటమికి బాధ్యుడిని చేస్తూ నన్ను బలిపశువును చేశారు. నన్ను తప్పించడం తీవ్ర నిరాశ, బాధను కలిగించాయి. అయితే ఒక్కటి మాత్రమ గర్వంగా చెప్పగలను. కోచ్‌గా పాక్‌ జట్టును అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాను" అని ఆర్థర్ తెలిపాడు.

యాషెస్: రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు మరో దెబ్బయాషెస్: రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు మరో దెబ్బ

ఇదిలా ఉంటే, వసీం ఆక్రమ్‌, మిస్బావుల్‌ హక్‌లతో కూడిన ఓ కమిటీ భేటిలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలని కమిటీకి అర్థర్‌ సూచించడం విశేషం. గత రెండేళ్లుగా సర్ఫరాజ్‌ సారథిగా విఫలమవుతున్నాడని, జట్టును ఏకతాటిపై నడిపించడంలో విఫలమయ్యాడని వారికి వివరించాడు.

Story first published: Wednesday, August 7, 2019, 22:35 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X