న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్గత వివాదం ముదురుతోందా?: వినోద్ రాయ్‌కి ఎడుల్జీ ఈ-మెయిల్‌

Diana Edulji slams CoA chief Vinod Rai; accuses him of diverting attention from allegations against CEO Rahul Johri

హైదరాబాద్: సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీలో అంతర్గత వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. జస్టిస్ లోథా కమిటీ నిబంధలను సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు గాను అత్యున్నత న్యాయస్థానం నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని 2013లో నియమించిన సంగతి తెలిసిందే.

ఆసీస్ పర్యటనకు ముందు మ్యాచ్ ప్రాక్టీస్‌పై అంబటి రాయుడి స్పందనఆసీస్ పర్యటనకు ముందు మ్యాచ్ ప్రాక్టీస్‌పై అంబటి రాయుడి స్పందన

ఈ కమిటీ ఏర్పాటైన కొన్ని నెలలకే ఇద్దరు తప్పుకోగా.. మిగిలిన ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సీఓఏ కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌కి, సభ్యురాలు డయానా ఎడుల్జీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

ఇందుకు ప్రదాన కారణం మహిళల జట్టు కోచ్ ఎంపికే. మహిళల క్రికెట్‌ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన రమేశ్‌ పొవార్‌నే పూర్తి స్థాయి కోచ్‌గా కొనసాగించాలని ఎడుల్జీ డిమాండ్ చేయగా... వినోద్ రాయ్ మాత్రం కోచ్‌ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా

మొత్తం 28 మంది సభ్యులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా అందులో పది మందితో కూడిన తుది జాబితాను ఎంపిక చేసి, వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. మాజీ ఆటగాడు డబ్ల్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది మాజీ క్రికెట్ దగిగ్జం కపిల్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.

రమేశ్ పొవార్‌ కూడా ఇంటర్వ్యూకు

రమేశ్ పొవార్‌ కూడా ఇంటర్వ్యూకు

వీరిలో రమేశ్ పొవార్‌ కూడా ఇంటర్వ్యూకు వచ్చినప్పటికీ అతను ఎంపిక కాకపోవడం ఎడుల్జీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె వినోద్‌ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ-మెయిల్‌ పంపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో వరల్డ్ టీ20 సెమీస్ నుంచి మిథాలీ రాజ్ తప్పించిన దానికి సంబంధించిన వివాదాన్ని ఉపయోగించుకుని తనను దెబ్బ తీసేందుకు రాయ్‌ ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.

జోహ్రీని తిరిగి బీసీసీఐ సీఈఓగా

జోహ్రీని తిరిగి బీసీసీఐ సీఈఓగా

దీంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్‌ జోహ్రీని తిరిగి బీసీసీఐ సీఈఓగా బాధ్యతలు అందుకోకూడదని ఎడుల్జీ పట్టుబట్టింది. రాహుల్‌ జోహ్రీపై వచ్చిన ఆరోపణలకు బీసీసీఐ ఓ విచారణ కమిటీని ఆదేశించింది. ఈ కమిటీ జోహ్రీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో అతడు తిరిగి సీఈఓగా నియమితుడయ్యాడు.

తీవ్రంగా వ్యతిరేకించిన డయానా ఎడుల్జీ

తీవ్రంగా వ్యతిరేకించిన డయానా ఎడుల్జీ

దీనిని డయానా ఎడుల్జీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే మిథాలీ రాజ్‌ని తప్పించడంలో తన పాత్ర ఉందంటూ గొడవను పెద్దది చేశారని రాయ్‌కు పంపిన మెయిల్లో ఎడుల్జీ మండిపడ్డారు. ఈ మెయిల్‌ను ఆమె బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరికి కూడా పంపడం విశేషం. వీరిద్దరి అంతర్గత పోరు ఇప్పుడు బీసీసీఐలో చర్చనీయాంశంగా మారింది.

Story first published: Saturday, December 22, 2018, 13:47 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X