న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ని సమం చేస్తాడా?: కోట్లాలో ధోనీని ఊరిస్తున్న మూడు రికార్డులివే

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా గురువారం జరిగే రెండో వన్డే జరగనుంది. ఈ సిరిస్‌లో ఇప్పటికే ధర్మశాల వన్డేలో విజయం సాధించిన టీమిండియా రెండో వన్డేలో నెగ్గి సిరిస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకూ 279 వన్డేలు ఆడిన ధోని మొత్తం 8939 పరుగులు చేశాడు. వన్డేల్లో 9,000 పరుగుల క్లబ్ లో చేరేందుకు ధోనీ ఇంకా 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

అదే విధంగా ఈ వన్డేలో ధోని మరో మూడు సిక్సర్లు బాదితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 195 సిక్సర్ల రికార్డుని కూడా సమం చేస్తాడు. అలా కాకుండా ఏడు సిక్సర్లు బాదితే 200 సిక్సర్లు బాదిన తొలి టీమిండియా ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

Dhoni needs 61 runs to complete his 9000 in ODIs, but can he deliver?

కాగా, వరుస విజయాలతో భారత జట్టు మంచి ఊపు మీదుంటే కెప్టెన్ ధోనీ మాత్రం కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తుంది. సారథిగా, బ్యాట్స్‌మన్‌గా వైస్ కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఇప్పుడు ధోనిలో ఆందోళన పెంచుతుంది. వన్డేలో 'మ్యాచ్ ఫినిషర్'గా పేరు తెచ్చుకున్న ధోని ఇప్పుడు ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

ధర్మశాల వన్డేలో 21 పరుగులకే రనౌట్ కావడంతో విమర్శకులు మరోసారి అతని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వన్డేలో భారీ ఇన్నింగ్స్‌ ఆడి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని ధోనీ శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం ధోని తీవ్రంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు.

ఢిల్లీ వన్డేలో భారత్‌దే విజయం!: చరిత్ర ఇదే చెబుతుంది

ఇదిలా ఉంటే ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమిండియాకు మెరుగైన ట్రాక్ రికార్డు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చే అంశం. కోట్లా మైదానంలో టీమిండియా ఆడిన వన్డేల్లో ఇప్పటి వరకు 12 వన్డేలు గెలవగా, ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది.

ధోనీని ఊరిస్తున్న మూడు రికార్డులివే:

* ధోని ఇప్పటి వరకూ 279 వన్డేలు ఆడి, మొత్తం 8939 పరుగులు చేశాడు. వన్డేల్లో 9,000 పరుగుల క్లబ్ లో చేరేందుకు ధోనీ ఇంకా 61 పరుగుల దూరంలో ఉన్నాడు.
* ఈ వన్డేలో తను మరో మూడు సిక్సర్లు బాదితే సచిన్ పేరిట ఉన్న 195 సిక్సర్ల రికార్డును సమం చేస్తాడు.
* ఏడు సిక్సర్లు బాదితే 200 సిక్సర్లు బాదిన తొలి టీమిండియా ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X