న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ వన్డేల్లో ధోనినే బెస్ట్‌ ఫినిషర్‌: ఆసీస్ మాజీ దిగ్గజం

MS Dhoni Is Still World's Best ODI Finisher Says Ian Chappell | Oneindia Telugu
Dhoni is still worlds best ODI finisher: Chappell

హైదరాబాద్: వన్డేలను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆసీస్ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే 'బెస్ట్‌ ఫినిషర్‌' అని చాపెల్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

చాపెల్ మాట్లాడుతూ

చాపెల్ మాట్లాడుతూ

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో చాపెల్ మాట్లాడుతూ "చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు" అని అన్నాడు.

గతంలో మైకేల్‌ బెవాన్‌

గతంలో మైకేల్‌ బెవాన్‌

గతంలో మైకేల్‌ బెవాన్‌కు ఈ విషయంలో మంచి రికార్డు ఉన్నా... మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కూడా బెవాన్‌కంటే ధోనినే అత్యుత్తమమని చాపెల్ చెప్పాడు. మరోవైపు వన్డే క్రికెట్‌లో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లిలను చాపెల్‌ అభివర్ణించారు.

కోహ్లీ ఒక్కడే

కోహ్లీ ఒక్కడే

వీరిలో కోహ్లీ ఒక్కడే ఇప్పుడు ఆడుతున్నాడని, అతను ఇప్పటి జోరును కొనసాగిస్తే సచిన్‌ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అతని అన్ని రికార్డులు అధిగమిస్తాడని, మరో 20 సెంచరీలు ఎక్కువ చేస్తాడని కూడా చాపెల్ చెప్పుకొచ్చాడు. ఇదే గనుక జరిగితే విరాట్‌ కోహ్లీని వన్డే బ్రాడ్‌మన్‌గా పిలవడంలో ఎలాంటి సందేహం ఉండదని చాపెల్ అన్నాడు.

Story first published: Monday, January 21, 2019, 9:08 [IST]
Other articles published on Jan 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X