న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోట్లాలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని ధోని కాళ్లు మొక్కాడు (వీడియో)

IPL 2019 : Once Again A Fan Broken Security Line & touch Dhoni's Legs | Oneindia Telugu
Dhoni Fans Once Again Breach Security to Touch His Feet During an IPL Match

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూస్తే చాలు.. వాళ్ల ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దక్కితే అదే పదివేలు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోనితో కరచాలనం చేయాలని

భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా అభిమానులు కొలుస్తారు. అరంగేట్రం నుంచి ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్ లతో అభిమానులను అలరిస్తోన్న ధోని కనిపిస్తే చాలు అమాంతం కాళ్ల మీద పడిపోతారు. ఇప్పటికే చాలా మంది అబిమానులు ధోనితో కరచాలనం చేయాలని, మ్యాచ్ మధ్యలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ వచ్చి కాళ్లు మొక్కిన సందర్భాలు అనేకం.

ఫిరోజ్ షా కోట్లాలో

మంగళవారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు అభిమానులు సెక్యూరిటీని దాటుకుని మరీ ధోనీ దగ్గరికి వచ్చి కాళ్లు మొక్కారు. ఇటీవలే భారత్-ఆసీస్ జట్ల మధ్య ముగిసిన ఓ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ అభిమాని ఇలాగే పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడిని ధోని పరిగెత్తించిన సంగతి తెలిసిందే.

6 వికెట్ల తేడాతో చెన్నై విజయం

కాగా, మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని (35 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జాదవ్‌ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టుని గెలిపించాడు.

చెన్నైకి వరుసగా రెండో విజయం

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా ఇది రెండో విజయం కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదనలో షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), మహేంద్రసింగ్ ధోని (32 నాటౌట్: 35 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, March 27, 2019, 17:02 [IST]
Other articles published on Mar 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X