న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్ అరుదైన ఘనత సాధించిన ఓపెనర్లు ధావన్-రాహుల్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు ఓ అరుదైన ఘనతను సాధించారు.

By Nageshwara Rao
Dhawan, Rahul Achieve Rare Feat After Century Stand in Second Innings Against Sri Lanka

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు ఓ అరుదైన ఘనతను సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన మొదటి ఇన్నింగ్స్‌లో సున్నాకే తొలి వికెట్ కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.

కోల్‌కతా టెస్టు, డే 5: లంచ్ విరామానికి భారత్ 251/5, లంకపై ఆధిక్యం 129కోల్‌కతా టెస్టు, డే 5: లంచ్ విరామానికి భారత్ 251/5, లంకపై ఆధిక్యం 129

తద్వారా ఓపెనర్లు శిఖర్ ధావన్-రాహుల్ జోడీ ఏడేళ్ల తర్వాత ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే తొలి వికెట్ కోల్పోయి రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇది రెండోసారి.

1981లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓపెనర్లు గవాస్కర్, చౌహాన్‌ల జోడీ తొలి వికెట్‌కు సున్నా పరుగలు జోడించగా.. రెండో వికెట్‌కు 133 పరుగులు నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లు ఇలాంటి ఘనతే ధావన్-రాహుల్ జోడీ నమోదు చేసింది.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కు సున్నా పరుగులు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఘనతను 1946లో మర్చంట్, సయ్యద్ ముస్తాక్ అలీ నమోదు చేయగా... 1967లో సర్దేశాయ్, ఇంజనీర్‌ల జోడీ నమోదు చేసింది.

1. Vs SL, Eden Gardens, 2017 (0, 133*) by KL Rahul & S Dhawan
2. Vs AUS, MCG, 1981 (0, 165) by Gavaskar & Chauhan
3. Vs WI, Chennai, 1967 (129, 0) by D Sardesai & F Engineer
4. Vs ENG, Manchester, 1946 (124, 0) by V Merchant & Syed Mushtaq Ali

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 13:02 [IST]
Other articles published on Nov 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X