న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫామ్‌ను దక్కించుకునేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న ధోనీ

India Vs West Indies 2018,4th ODI : Dhoni Slogs It out in the nets Ahead Of 4th ODI| Oneindia Telugu
Despite optional practice session, MS Dhoni slogs it out in the nets ahead of 4th ODI against West Indies

హైదరాబాద్: మునుపటి ఫామ్‌ను దక్కించుకునేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ నెట్స్‌లో చెమటోడ్చాడు. ఫామ్‌లో లేకపోవడంతో ఇటీవల వెస్టిండీస్‌తో భారత్ ఆడబోయే టీ20లోనూ స్థానం కోల్పోయిన ధోనీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి కొద్ది నెలల్లో రాబోయే ప్రపంచ కప్‌కు టీమిండియాలో ధోనీ చోటు విషయం మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఐచ్చిక సాధనలో ధోనీ బాగా సాధన చేశాడు.

45 నిమిషాల పాటు శ్రమించిన ధోనీ

45 నిమిషాల పాటు శ్రమించిన ధోనీ

ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌తో మూడో మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఆకట్టుకోలేదు. కేవలం 11 బంతులు ఆడి 7 పరుగులు చేశాడు. విండీస్‌ నిర్దేశించిన 284 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ త్వరగా టాప్‌ఆర్డర్‌ వికెట్లు చేజార్చుకోవడంతో మహీ త్వరగా క్రీజులోకి వచ్చాడు. మిగతా ఆటగాళ్లూ స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడంతో భారత్‌ 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ధోనీ ఆదివారం 45 నిమిషాలు స్థానిక బౌలర్ల బౌలింగ్‌లో సాధన చేశాడు.

టీ20ల నుంచి ధోనీని అందుకే తప్పించారా??

తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా ప్లేయర్లు:

తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా ప్లేయర్లు:

భారీ స్కోర్లు చేయలేక పోతున్న అతడు అసిస్టెంట్‌‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌తో కొన్ని విషయాలు మాట్లాడాడు. భారత్‌ సోమవారం ముంబై బ్రబౌర్న్‌ మైదానంలో విండీస్‌తో తదుపరి మ్యాచ్‌ నాలుగో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమం కావడంతో ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, రవీంద్ర జడేజా మైదానంలో సాధన చేశారు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్‌ సోమవారం నాటి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. విండీస్‌ ఆటగాళ్లు సాధన చేయలేదు.‌

తప్పించడం సరైన నిర్ణయమేనని అగార్కర్

తప్పించడం సరైన నిర్ణయమేనని అగార్కర్

టీ20 జట్టు నుంచి మహేంద్రసింగ్ ధోనీని సెలక్టర్లు తప్పించడం సరైన నిర్ణయమేనని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం సెలక్టర్లు ఇటీవల జట్టుని ప్రకటించగా.. అందులో ధోనీపై వేటు వేశారు. దీంతో.. ఈ మాజీ కెప్టెన్ టీ20 కెరీర్‌ ఇక ముగిసిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.

ధోనీకి షార్ట్ ఫార్మాట్‌‌లో అపార అనుభవం

ధోనీకి షార్ట్ ఫార్మాట్‌‌లో అపార అనుభవం

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోనీకి ఈ షార్ట్ ఫార్మాట్‌ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంతలా అంటే.. భారత్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడితే.. ధోనీ ఏకంగా 93 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా తుది జట్టులో ఆడాడు

1
44269
Story first published: Monday, October 29, 2018, 11:18 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X