దేవధర్‌ ట్రోఫీ: ఫైనల్లో కర్ణాటకపై భారత్‌ ‘బి’ ఘన విజయం

Posted By:
Deodhar Trophy

హైదరాబాద్: విజయ్‌ హాజరే ట్రోఫీతో పాటు.. దేవధర్‌ ట్రోఫీ కూడా కైవసం చేసుకోవాలనుకున్న కర్ణాటకకు నిరాశే ఎదురైంది. దేవధర్‌ ట్రోఫీ సాంతం తన అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టుని ఫైనల్‌ చేర్చిన రవికుమార్ సమర్థ్‌ మరోసారి సెంచరీతో మెరిసినా కర్ణాటకకు విజయాన్ని అందించలేకపోయాడు.

గురువారం శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత్‌ 'బి'తో జరిగిన ఫైనల్లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటకకు శుభారంభం దక్కలేదు. ఈ ఏడాది దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్‌ అగర్వాల్‌ (14), కరుణ్‌ నాయర్‌ (10) త్వరగానే ఔటయ్యారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవికుమార్‌ సమర్థ్‌ (107) సీఎం గౌతమ్‌ (76) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌-బి 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్లు గైక్వాడ్‌ (58), ఈశ్వరన్‌ (69)లతో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (61; 7 ఫోర్లు), మనోజ్‌ తివారి (59 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును విజయపథంలో నడిపించారు. ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేశ్‌ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.

Brief scores: Karnataka: 279/8 (Ravikumar Samarth 107, C M Gautam 76; K Khaleel Ahmed 3/49) lost to India B: 281/4 (Shreyas Iyer 61, Abhimanyu Easwaran 69, Manoj Tiwary 59 not out; Shreyas Gopal 2/55).

Story first published: Friday, March 9, 2018, 9:42 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి