అసలు సెన్స్ ఉందా మీకు.. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ ఫైర్!!

IPL 2020 : Delhi Capitals Co-Owner Questions BCCI On Rishabh Pant And R Ashwin

ఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను భారత సెలక్షన్ కమిటీ పక్కన పెడుతుండటంపై ఐపీఎల్‌ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహ యజమాని పార్థ జిందాల్ మండిపడ్డారు. పంత్‌ని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టేందుకే జట్టులోకి ఎంపిక చేశారా?, టీ20 ఫార్మాట్‌లో అశ్విన్‌ను ఎందుకు ఎంపిక చెయ్యట్లేదు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

పంత్, అశ్విన్‌కు మద్దతు

పంత్, అశ్విన్‌కు మద్దతు

న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. సెలక్షన్ కమిటీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రిషబ్ పంత్‌కి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. పైగా పంత్‌ స్థానంలో కేఎల్ రాహుల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇక అశ్విన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎప్పటినుండో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పంత్, అశ్విన్‌కు మద్దతుగా నిలిచిన జిందాల్ భారత సెలక్షన్ కమిటీని ఏకిపారేశారు.

వికెట్ టేకర్స్ కావాలి:

జిందాల్ సౌత్-వెస్ట్ స్పోర్ట్స్ (జెఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్) అధిపతి పార్థ జిందాల్ ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. 'అశ్విన్ ఎందుకు జట్టులో లేడో తెలియదు. వికెట్ తీసేవారు జట్టులో లేరు. టీ20లో కివీస్‌ దెబ్బతిన్నా.. గొప్పగా పుంజుకుని ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ ఓటమిని మరోసారి చూపించింది. వికెట్ టేకర్స్, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఆటగాళ్ళు జట్టుకు కావాలి' అని పార్థ జిందాల్ పేర్కొన్నారు.

ఏమాత్రం అర్థం లేదు

'పంత్‌ని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టేందుకే జట్టులోకి ఎంపిక చేశారా?. జట్టులోకి ఎంపిక చేయకుండా ఉంటే.. భారత్-ఎ లేదా దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడేవాడు. కివీస్‌పై టీ20 సిరీస్‌‌లో 4-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కూడా ఐదో టీ20లో అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇక వన్డే సిరీస్‌ని 0-2తో వెనుకపడ్డా కూడా.. నామమాత్రమైన మూడో వన్డేలోనూ పంత్‌కు చోటివ్వకపోవడంలో ఏమాత్రం అర్థం (సెన్స్) లేదు' అని పార్థ జిందాల్ అన్నారు.

వరుస అవకాశాలు:

వరుస అవకాశాలు:

గత ఏడాది పంత్‌కి టీమిండియా వరుస అవకాశాలు ఇచ్చింది. అయితే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లలో వరుసగా విఫలమైన పంత్‌.. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా గాయపడడంతో.. పంత్ స్థానంలో రాహుల్ కీపింగ్ బాధ్యతలు అందుకుని సక్సెస్ అయ్యాడు. దీంతో రెగ్యులర్‌ కీపర్‌ అవతారమెత్తి పంత్‌కి అవకాశాలు రాకుండా చేసాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, February 13, 2020, 15:24 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X