టైమ్‌ మారలేదు!: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడబోయేది ఎవరో తెలుసా?

Posted By: Subhan
Defending champions MI host CSK in IPL 2018 opener

హైదరాబాద్: రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ఏర్పాట్లు భారీగానే ఆరంభమవుతున్నాయి. మీడియా పంపిన ప్రతిపాదన బీసీసీఐ పరిశీలించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పింది. గతంలోలానే సాయంత్రం 4, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు మొదలవుతాయి.

అంతేగాక, బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌లో తొలి, తుది మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 7న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనుంది. ఫైనల్‌ మే 27న ఉంటుంది.

మ్యాచ్‌ల సమయాల్లో మార్పులకు సంబంధించి గతంలో బీసీసీఐ ఒక ప్రతిపాదన పరిశీలించింది. 8 గంటల మ్యాచ్‌లను ఏడింటికి, వారాంతాల్లో 4 గంటల మ్యాచ్‌లను 5.30కి మార్చాలని భావించింది. ఐతే అన్ని ఫ్రాంచైజీలు తిరస్కరించడంతో పాత సమయాలనే బీసీసీఐ ప్రకటించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ముగిసింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ వేదికగా ఈ వేలం రెండు రోజుల పాటు జరిగింది. ఈ వేలంలో మొత్తం 578 మంది క్రికెటర్లకు బీసీసీఐ అనుమతిచ్చింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో మొత్తం 169 మంది క్రికెటర్లు అమ్ముడుపోయారు.

ఐపీఎల్ వేలం 2018: కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు వీరే:
ఇందులో 56 మంద విదేశీ అటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో కోసం 8 ప్రాంఛైజీలు మొత్తం రూ. 4,31,70,00,000 కోట్లను ఖర్చు చేశాయి. గతేడాది లాగే ఈసారి కూడా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రూ.12.5 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఈసారి వేలంలో భారత ఆటగాళ్లకు కోట్లు దక్కాయి.

చెన్నై సూపర్ కింగ్స్
1. ధోనీ (రూ.15 కోట్లు- Retained)
2. రైనా (రూ.11 కోట్లు- Retained)
3. జడేజా (రూ.7 కోట్లు- Retained)
4. డుప్లెస్సి (రూ.1.6 కోట్లు)
5. హర్భజన్ (రూ.2 కోట్లు)
6. డ్వేన్ బ్రేవో (రూ.6.4 కోట్లు)
7. షేన్ వాట్సన్ (రూ.4 కోట్లు)
8. కేదార్ జాదవ్ (రూ.7.8 కోట్లు)
9. అంబటి రాయుడు (రూ.2.2 కోట్లు)
10. ఇమ్రాన్ తాహిర్ (రూ.1 కోటి)
11. కరణ్ శర్మ (రూ.5 కోట్లు)
12. శార్దూల్ ఠాకూర్ (రూ.2.6 కోట్లు)
13. జగదీశన్ నారాయణ్ (రూ.20 లక్షలు)
14. మిచెల్ సాంట్నెర్ (రూ.50 లక్షలు)
15. దీపక్ చహర్ (రూ.80 లక్షలు)
16. ఆసిఫ్ కేఎం (రూ.40 ల‌క్ష‌లు)
17. లుంగి ఎంగిడి (రూ.50 ల‌క్ష‌లు)
18. క‌నిష్క్ సేథ్ (రూ.20 ల‌క్ష‌లు)
19. ధృవ్ షోరే (రూ.20 ల‌క్ష‌లు)
20. ముర‌ళీ విజ‌య్ (రూ.2 కోట్లు)
21. శామ్ బిల్లింగ్స్ (రూ.కోటి)
22. మార్క్ వుడ్ (రూ.1.5 కోట్లు)
23. క్షితిజ్ శ‌ర్మ (రూ.20 ల‌క్ష‌లు)
24. మోను సింగ్ (రూ.20 ల‌క్ష‌లు)
25. చైత‌న్య బిష్ణోయ్ (రూ.20 ల‌క్ష‌లు)

ముంబై ఇండియన్స్
1. రోహిత్‌శర్మ (రూ.15 కోట్లు-Retained)
2. హార్దిక్ పాండ్యా (రూ.11 కోట్లు-Retained)
3. జస్‌ప్రీత్ బుమ్రా (రూ.7 కోట్లు-Retained)
4. కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు-ఆర్టీఎమ్)
5. ముస్తఫిజుర్ రెహమాన్ (రూ.2.2 కోట్లు)
6. పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు)
7. సూర్యకుమార్ జాదవ్ (రూ.3.2 కోట్లు)
8. కృనాల్ పాండ్యా (రూ.8.8 కోట్లు- RTM)
9. ఇషాన్ కిషన్ (రూ.6.2 కోట్లు)
10. రాహుల్ చహర్ (రూ.1.9 కోట్లు)
11. ఎవిన్ లూయిస్ (రూ.3.8 కోట్లు)
12. సౌరభ్ తివారీ (రూ.80 లక్షలు)
13. బెన్ కటింగ్ (రూ.2.2 కోట్లు)
14. ప్రదీప్ సాంగ్వాన్ (రూ.1.5 కోట్లు)
15. డుమిని (రూ.కోటి)
16. జేసన్ బెహ్రండార్ఫ్ (రూ.1.5 కోట్లు)
17. తజిందర్ ఢిల్లాన్ (రూ.55 లక్షలు)
18. శ‌ర‌ద్ లంబా (రూ.20 ల‌క్ష‌లు)
19. సిద్దేశ్ లాడ్ (రూ.20 ల‌క్ష‌లు)
20. ఆదిత్య తారె (రూ.20 ల‌క్ష‌లు)
21. మ‌యాంక్ మార్ఖాండె (రూ.20 ల‌క్ష‌లు)
22. అఖిల్ ధ‌నంజ‌య (రూ.50 ల‌క్ష‌లు)
23. అనుకుల్ రాయ్ (రూ.20 ల‌క్ష‌లు)
24. మోహిసిన్ ఖాన్ (రూ.20 ల‌క్ష‌లు)
25. నిదీష్ ఎండీ దినేష‌న్ (రూ.20 ల‌క్ష‌లు)

Story first published: Thursday, February 15, 2018, 8:44 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి