న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటపై ధోనీకి టచ్‌ పోయింది.. అందుకే ఇలా!!

Deepak Chahar Reveals MS Dhoni Has Lost Touch, Cant Play PubG That Well Now

చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ సందర్భంగా టీమిండియా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమై తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇష్టపడేవారితో సంతోషంగా ఉండండి.. అనుష్క శర్మ భావోద్వేగ సందేశం!!ఇష్టపడేవారితో సంతోషంగా ఉండండి.. అనుష్క శర్మ భావోద్వేగ సందేశం!!

పబ్​జీ అధికంగా ఆడుతున్నా:

పబ్​జీ అధికంగా ఆడుతున్నా:

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు టీమిండియా యువ పేసర్ దీపక్‌ చాహర్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్, చెన్నై సారథి ఎంఎస్ ధోనీకి పబ్‌జీ గేమ్‌పై టచ్‌ పోయిందని చెప్పాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా పబ్​జీ అధికంగా ఆడుతున్నానని ఇంటర్వ్యూలో చాహర్ చెప్పాడు. ఐపీఎల్​లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చాహర్ ప్రధాన బౌలర్​గా ఎదిగిన సంగతి తెలిసిందే.

 పబ్​జీపై ధోనీకి పట్టు పోయింది:

పబ్​జీపై ధోనీకి పట్టు పోయింది:

చాహర్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేసిన చెన్నై రెండు ఆప్షన్స్‌ ఇచ్చి ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలని కోరింది. ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. గేమ్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ లేదా పబ్‌జీ? అనే ప్రశ్నకు చాహర్‌ ఇలా బదులిచ్చాడు. 'పబ్‌జీ. ఇంకా ఆ గేమ్‌ను ఆడుతున్నా. గతంలో ఎంఎస్ ధోనీ కూడా ఆ గేమ్ బాగా ఆడేవాడు. కానీ.. ఇప్పడు కాదు. అతడు కాల్ ఆఫ్ డ్యూటీ (సీవోడీ) గేమ్​కు మారాడు. ఈ మధ్య కాలంలో ఓ సారి మళ్లీ పబ్​జీలోకి వచ్చాడు. అయితే సీవోడీ ఎక్కువగా ఆడడంతో పబ్​జీపై ధోనీకి పట్టు పోయింది. సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు' అని చాహర్‌ తెలిపాడు.

చహల్‌, ష‌మీ, భువనేశ్వర్‌ కూడా:

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆన్‌లైన్ 'పబ్‌జీ' గేమ్ యువతను విపరీతంగా ఆకర్షించింది. ఇక భారత్‌లో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువగా ఉంది. యువతను ఎక్కడ చూసినా.. నిద్ర, ఆహరం మాని ఈ గేమ్ ఆడుతూ కనిపిస్తున్నారు. యువతను అంతగా ఆకట్టుకున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్.. టీమిండియా ఆటగాళ్లను కూడా వదల్లేదు. మ్యాచ్, ప్రయాణ సమయంలో కొద్దిగా ఖాళీ సమయం దొరికితే చాలు ఆటగాళ్లు ఈ గేమ్ ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్‌ 2019 సమయంలో ధోనీ, చహల్‌, ష‌మీ, భువనేశ్వర్‌లు పబ్‌జీ గేమ్‌ ఆడారు. ఇక లాక్‌డౌన్‌ సందర్భంగా పబ్‌జీ ఆడడం మరింత ఎక్కువైంది.

Story first published: Wednesday, April 8, 2020, 8:56 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X