న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన పంత్: వన్డేల్లో అరంగేట్రం, ధోని చేతుల మీదుగా క్యాప్

India vs Westindies 1st Odi : Rishabh Pant Creates A New History
Debutant Rishabh Pant creates history, becomes second-youngest Indian player to play all formats

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం గువహటి వేదికగా ప్రారంభమైన తొలి వన్డే ద్వారా రిషబ్ పంత్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రంతో పంత్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అచ్చం బుమ్రాలాగే పాక్ చిన్నారి బౌలింగ్: ట్విట్టర్‌లో స్పందించిన బుమ్రాఅచ్చం బుమ్రాలాగే పాక్ చిన్నారి బౌలింగ్: ట్విట్టర్‌లో స్పందించిన బుమ్రా

భారత్ తరఫున క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన అతిపిన్న వయసు గల రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు ఇషాంత్ శర్మ 19 ఏళ్ల 152 రోజుల వయసులో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు రిషబ్ పంత్ 21 సంవత్సరాల 17 రోజులతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ధోని చేతుల మీదుగా వన్డే క్యాప్‌ని అందుకున్న పంత్

వన్డేల్లో రిషబ్ పంత్ అరంగేట్రం అతనికి ఓ మధుర క్షణాన్ని మిగిల్చింది. గువహటి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా అతడు వన్డే క్యాప్‌ని అందుకోవడం విశేషం. వాస్తవానికి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రిషబ్ పంత్ గతేడాదే అడుగుపెట్టాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఫిబ్రవరి 1న జరిగిన మూడో మ్యాచ్‌లో

ఫిబ్రవరి 1న జరిగిన మూడో మ్యాచ్‌లో

దీంతో ఫిబ్రవరి 1న జరిగిన మూడో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రిషబ్ అరంగేట్రం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తరవాత వెస్టిండిస్ వెళ్లిన జట్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నప్పటికీ.... వన్డే తుది జట్టులో అవకాశం లభించలేదు. వెస్టిండిస్ పర్యటనలో కేవలం ఏకైక టీ20లో మాత్రం భారత్ తరుపున ఆడాడు.

ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ

ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరిస్‌కు పంత్ ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు. దినేష్ కార్తీక్ గాయం కారణంగా వైదొలగడంతో అతని స్థానంలో మూడో టెస్టుకు సెలక్టర్లు రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. ఈ పర్యటనలో ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో సెంచరీ సాధించి టెస్టుల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

తొలి వన్డేలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా చోటు

ఇక, వన్డే సిరిస్‌కు ముందు విండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు టెస్టుల్లో 90కి పైగా పరుగులు చేసి ఔటయ్యాడు. ఇప్పుడు తొలి వన్డేలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న సిరీస్‌ కావడంతో పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరిస్‌లో పంత్ రాణిస్తే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవడం ఖాయం.

Story first published: Sunday, October 21, 2018, 15:32 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X