ఆప్ఘన్ తాత్కాలిక కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్‌ జోన్స్‌

Posted By:

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ డీన్‌ జోన్స్‌ అప్ఘనిస్థాన్‌ క్రికెట్‌ జట్టు తాత్కాలిక కోచ్‌గా ఎంపికయ్యారు. హాంకాంగ్‌ పర్యటన సందర్భంగా డీన్ జోన్స్‌తో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

సెప్టెంబర్ నెలలో నిర్వహించిన షెపజీనా దేశవాళీ టీ20 టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరించేందుకు డీన్ జోన్స్‌ అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో అప్పుడే డీన్ జోన్స్‌తో అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

Dean Jones appointed interim coach of Afghanistan

డీన్ జోన్స్‌తో భవిష్యత్తులోనూ తమ సంబంధాలు కొనసాగుతాయని అప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అక్టోబర్‌ 20 డీన్ జోన్స్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్ఘనిస్థాన్ తాత్కాలిక కోచ్‌గా వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని డీన్ జోన్స్ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

Story first published: Tuesday, October 10, 2017, 21:48 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి