న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో క్రికెటర్‌: ఎలైట్ జాబితాలోకి డీన్ ఎల్గర్

By Nageshwara Rao
Dean Elgar joins Desmond Haynes in elite club of two

హైదరాబాద్: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్‌ (141 నాటౌట్‌)గా నిలిచిన సంగతి తెలిసిందే.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తద్వారా టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఓపెనర్‌గా వచ్చి అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాట్స్ మెన్‌గా గుర్తింపు పొందాడు. ఎల్గర్‌ 48 టెస్టుల్లోనే ఈ ఘనతను సాధించగా... మరోవైపు ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు సార్లు సాధించడం మరో విశేషం.

ఈ ఏడాది మొదట్లో భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో ఎల్గర్‌ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2015లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్గర్‌ (118 నాటౌట్‌)గా నిలిచి తొలి సారి ఈ ఘనత సాధించాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

తద్వారా అంతకముందు మూడు సార్లు ఈ ఘనత సాధించిన విండీస్‌ దిగ్గజ క్రికెటర్ దేశమొండ్ హేన్స్‌తో సమంగా నిలిచాడు. హెన్స్‌ కూడా మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌పై (1986లో 88 నాటౌట్‌), ఇంగ్లండ్‌పై(1991లో75 నాటౌట్‌), పాకిస్తాన్‌పై (1993లో143 నాటౌట్‌) ఈ ఘనత సాధించాడు.

ఓపెనర్‌గా వచ్చి అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మెన్:

* దేశమొండ్ హేన్స్‌ (వెస్టిండిస్)- 3 సార్లు - 88* v Pak in Karachi (1986), 75* v Eng at The Oval (1991) & 143* v Pak in Port of Spain (1993)
* డీన్ ఎల్గర్ (దక్షిణాఫ్రికా)- 3 సార్లు - 118* v Eng in Durban (2015), 86* v Ind in Johannesburg (2018) & 141* v Aus in Cape Town (2018)
* బిల్ ఉడ్‌పుల్ (ఆస్ట్రేలియా) - 2 సార్లు - 30* v Eng in Brisbane (1928) & 73* v Eng in Adelaide (1933)
* లెన్ హుట్టన్ (ఇంగ్లాండ్)- 2 సార్లు - 202* v WI at The Oval (1950) & 156* v Aus in Adelaide (1951)
* బిల్ లార్వే (ఆస్ట్రేలియా) - 2 సార్లు - 49* v Ind in New Delhi (1969) & 60* v Eng in Sydney (1971)
* గ్లెన్ టర్నర్ (న్యూజిలాండ్) - 2 సార్లు - 43* v Eng at Lord's (1969) & 223* v WI in Kingston (1972)

దేశాల వారి జాబితాను పరిశీలిస్తే ఆస్ట్రేలియా(13) అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించగా... భారత్‌ నాలుగు సార్లు ఈ ఘనతను సాధించింది. భారత్‌ నుంచి సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, చతేశ్వర పుజారాలు తలో ఒకసారి ఈ రికార్డు నమోదు చేశారు.

దేశాల వారి జాబితాను పరిశీలిస్తే:
* ఆస్ట్రేలియా - 13 సార్లు - Jack Barrett, Warwick Armstrong, Warren Bardsley, Bill Woodfull (2), Bill Brown, Bill Lawry (2), Ian Redpath, David Boon, Mark Taylor, Simon Katich, David Warner
* ఇంగ్లాండ్ - 9 సార్లు - Bobby Abel, Pelham Warner, Len Hutton (2), Geoffrey Boycott, Graham Gooch, Alec Stewart, Mike Atherton, Alastair Cook
* దక్షిణాప్రికా - 8 సార్లు - Bernard Tancred, Billy Zulch, Trevor Goddard, Jackie McGlew, Gary Kirsten, Dean Elgar (3)
* వెస్టిండిస్ - 7 సార్లు - Frank Worrell, Conrad Hunte, Desmond Haynes (3), Chris Gayle, Kraigg Brathwaite
* పాకిస్థాన్ - 4 సార్లు - Nazar Mohammad, Mudassar Nazar, Saeed Anwar, Imran Farhat
* ఇండియా - 4 సార్లు - Sunil Gavaskar, Virender Sehwag, Rahul Dravid, Cheteshwar Pujara
* శ్రీలంక - 3 సార్లు - Sidath Wettimuny, Marvan Atapattu, Russel Arnold
* జింబాబ్వే - 3 సార్లు - Mark Dekker, Grant Flower, Tino Mawoyo
* న్యూజిలాండ్ - 2 సార్లు - Glenn Turner (2)
* బంగ్లాదేశ్ - ఒకసారి - Javed Omar

Story first published: Saturday, March 24, 2018, 17:04 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X