న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ వన్ హ్యాండ్ సిక్స్.. చూస్తారా: ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడమే కాదు..

DC vs MI, IPL 2021: Rohit Sharma smashed One-Handed Six Off Ashwin

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఐపీఎల్ 2020 ఫైనలిస్టుల మధ్య సాగిన ఈ పోరులో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో మరింత పైకి దూసుకెళ్లింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళశారం రాత్రి జిరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అండ్ హిస్ టీమ్.. అనూహ్య పరాజయాన్ని చవి చూసింది. నాసిరకం బ్యాటింగ్‌తో ఓటమిని కొని తెచ్చుకుంది. బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందనే విషయం ఇక్కడ స్పష్టమైంది. బౌలర్లు ఫర్వాలేదనిపించారు.

ఆడింది అతనొక్కడే..

ఈ మ్యాచ్‌లో రాణించింది రోహిత్ శర్మ ఒక్కడే. మరోసారి అర్థసెంచరీకి చేరువగా వెళ్లాడు. 40 ప్లస్ స్కోర్ చేశాడు. 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 44 పరుగులు చేశాడతను. కేప్టెన్‌గా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని తరువాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జయంత్ యాదవ్ మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులను స్కోర్‌బోర్డుపై జోడించారు. ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కీరన్ పొలార్డ్.. మళ్లీ విఫలమయ్యాడు.

 సింగిల్ హ్యండ్ సిక్స్

సింగిల్ హ్యండ్ సిక్స్

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్స్.. సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. వన్ హ్యాండ్ సిక్సర్ అది. ఢిల్లీ కేపిటల్స్ టాప్ క్లాస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆ షాట్ ఆడాడు. ఇన్నింగ్ నాలుగో ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ సిక్స్‌గా మలిచిన తీరు.. అతని పవర్ ప్లే సత్తా చాటింది. అశ్విన్ రెండో ఓవర్ చివరి బంతి అది. అప్పటికి ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు. తన రెండో ఓవర్‌లో అశ్విన్ భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఆ ఓవర్‌లో 15 పరుగులు పిండుకున్నారు.

15 పరుగులు పిండేశారు..

15 పరుగులు పిండేశారు..

అశ్విన్ రెండో ఓవర్ తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఫోర్‌గా మలిచాడు. అశ్విన్ సంధించిన క్యారమ్ బాల్‌ను కవర్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించగా.. అది ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ వైపు దూసుకెళ్లింది. బౌండరీ దాటింది. రెండో ఓవర్‌కు పరుగులు రాలేదు. మూడో బంతికి సూర్యకుమార్ సింగిల్ తీశాడు. నాలుగో బంతిని రోహిత్ శర్మ ఫోర్ బాదాడు. మిడిల్ పిచ్‌ పడి లెగ్ సైడ్‌కు టర్న్ అయిన బంతిని బ్యాక్ వర్డ్ స్క్వేర్ వైపు అద్భుతమైన స్వీప్ షాట్ ఆడాడు రోహిత్ శర్మ. అయిదో బంతికి రన్ రాలేదు. చివరి బంతిని ఒంటిచేత్తో సిక్స్‌గా మలిచాడు. కుడివైపు బౌల్ చేసిన ఆ బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా ఒంటిచేత్తో సిక్స్‌ కొట్టాడు. 78 మీటర్ల అవతలికి వెళ్లి పడిందా బంతి.

Story first published: Wednesday, April 21, 2021, 8:42 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X