న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నవ్వుతూ కనుసైగ చేసిన ధోని: వెనక్కి వెళ్లిన డ్వేన్ బ్రావో (వీడియో)

DC vs CSK: Twitter is in love with Dhonis reaction to Dwayne Bravo

హైదరాబాద్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని వికెట్ కీపింగ్‌లో తన మార్క్‌ని మరోసారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోని, బౌలర్ డ్వేన్ బ్రావోల మధ్య చోటు చేసుకున్న సంఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోనీని డీఆర్‌ఎస్ అడగమని చెప్పిన బ్రావో

ధోనీని డీఆర్‌ఎస్ అడగమని చెప్పిన బ్రావో

ఈ మ్యాచ్‌లో ఓ సందర్భంలో ధోనీని డీఆర్‌ఎస్ అడగమని చెప్పిన డ్వేన్ బ్రావో ఒక్క కనుసైగతో సైలెంట్‌గా వెనక్కి వెళ్లిపోయాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కీమా పాల్ విఫలమయ్యాడు. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి పాల్ ఫ్యాడ్స్‌ను తాకగా ఎల్బీ కోసం బౌలర్ బ్రావోతో పాటు చెన్నై ఫీల్డర్లు అప్పీల్ చేశారు.

ధోనీ చిన్నగా నవ్వుతూ ఓ కనుసైగ

దీంతో ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా కెప్టెన్ ధోనీని బ్రావో అడగ్గా ధోనీ చిన్నగా నవ్వుతూ ఓ కనుసైగ చేశాడు. ధోనీ స్పందించిన తీరుని చూసి బ్రావో నవ్వుకుంటూ వెనక్కి వెళ్లిపోయాడు. ఇక,

రిప్లైలో బంతి ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. ధోని గనుక రివ్యూ కోరినట్లైతే వృథా అయి ఉండేది.

6 వికెట్ల తేడాతో చెన్నై విజయం

6 వికెట్ల తేడాతో చెన్నై విజయం

కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదనలో షేన్ వాట్సన్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), మహేంద్రసింగ్ ధోని (32 నాటౌట్: 35 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది.

ధావన్ హాఫ్ సెంచరీ

ధావన్ హాఫ్ సెంచరీ

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. యువ ఓపెనర్‌ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) జట్టు స్కోరు 36 వద్ద ఔటవ్వగా... శిఖర్‌ ధావన్‌(51: 47 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, March 27, 2019, 15:52 [IST]
Other articles published on Mar 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X