న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డీకాక్‌తో గొడవ: వార్నర్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా హెడ్ కోచ్

David Warner to Remain Australia Vice-captain: Coach Darren Lehmann

హైదరాబాద్: రెండ్రోజులుగా వివాదాలు కొనసాగుతున్న డేవిడ్ వార్నర్-డికాక్‌ల మధ్య పొంతన కుదుర్చేందుకు డారెన్ లీమన్ కదిలాడు. అంతేగాక, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మద్దతుగా ఆ జట్టు కోచ్ డారెన్ లీమన్ నిలిచాడు. ఆసీస్ వైస్ కెప్టెన్‌గా వార్నర్ కొనసాగుతాడని స్పష్టం చేశాడు.

డర్బన్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ టెస్టు నాలుగో రోజు ఆటలో సఫారీ ఆటగాడు క్వింటన్ డికాక్, వార్నర్ వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు లీమన్ పూనుకున్నాడు.

'మేము కచ్చితంగా వార్నర్‌కు మద్దతు తెలుపుతాం. మ్యాచ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేకమైన మార్గంలో ఆడాలని కోరుకుంటాం. మా దృష్టిలో మేము మా పరిధిని దాటలేదు. అదే ముఖ్యమైన అంశం. ఈ ఘటనపై ఎవరి అభిప్రాయం వారికుంది. మున్ముందు రెండు జట్లు ఎలా ఆడుతాయో, ఏం జరుగుతుందో వేచి చుద్దాం. మా లక్ష్యం సఫారీ గడ్డపై సిరీస్‌ను గెలవడమే. ఐదు రోజుల ఆటను చూశాం. ఇక్కడ సిరీస్‌ను గెలవడం చాలా కష్టమైనది అని లీమన్ పేర్కొన్నాడు.

ఇరు జట్ల మధ్య పోర్ట్‌ఎలిజబెత్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. వివాదాస్పద ఘటనపై ఆస్ట్రేలియా క్రికెట్ విచారణ జరుపుతోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ మాట్లాడతూ.. 'ఎవరైనా ఒక పద్ధతిని తీవ్రంగా అలవాటు చేసుకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని పేర్కొన్నాడు. ఇరు వైపులా ఒకే స్థాయిలో సర్దుకుపోని గుణంతో కొనసాగుతుండటంతో సమస్య జఠిలమైపోతోంది' అని పేర్కొన్నాడు..

Story first published: Tuesday, March 6, 2018, 18:00 [IST]
Other articles published on Mar 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X