న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs SL: బర్త్‌డే రోజు సెంచరీ.. వాట్సన్‌, మ్యాక్స్‌వెల్‌ సరసన వార్నర్‌!!

David Warner hits maiden T20 ton, becomes 3rd Aussie with centuries in 3 formats

అడిలైడ్‌: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ పరుగుల సునామీ సృష్టించడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా వార్నర్‌ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి చేసిన సెంచరీ (100; 56 బంతుల్లో 10x4,4x6)ని తన బర్త్‌డేకి తనే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. అనంతరం బౌలర్లు లంక బ్యాట్స్‌మన్‌ను ఓ ఆటాడుకున్నారు. దీంతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది. టీ20లలో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద విజయం.

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో భారత్ చర్చలు.. ఈడెన్‌ గార్డెన్స్‌లో డేనైట్‌ టెస్టు?!!India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో భారత్ చర్చలు.. ఈడెన్‌ గార్డెన్స్‌లో డేనైట్‌ టెస్టు?!!

మూడు ఫార్మాట్లలో సెంచరీలు:

మూడు ఫార్మాట్లలో సెంచరీలు:

తొలి టీ20లో డేవిడ్‌ వార్నర్‌ సెంచరీ చేయడంతో.. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. వార్నర్‌ కన్నా ముందు మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసారు. అంతేకాదు టీ20లలో వార్నర్‌కు ఇదే తొలి సెంచరీ. ఆసీస్ మాజీ విధ్వంసక ఆటగాళ్ళు హేడెన్, గిల్ క్రిస్ట్ లాంటి ఆటగాళ్లు కూడా టీ20లో సెంచరీ చేయలేదు. వారికి సాధ్యం కానీ రికార్డులను ఈ ముగ్గురు అందుకున్నారు.

నిషేధం తర్వాత తొలి టీ20 మ్యాచ్:

నిషేధం తర్వాత తొలి టీ20 మ్యాచ్:

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్‌లు తొలిసారి పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగి దుమ్మురేపాడు. అయితే 2019 యాషెస్‌ సిరీస్‌లో పరుగులు చేయడంలో మాత్రం ఇబ్బందిపడ్డారు. హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్టులో 61 పరుగులు తప్ప మిగతా అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి కేవలం 31 పరుగులే చేశాడు. మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే వార్నర్‌ తిరిగి ఫామ్‌లోకి రావడం ఆసీస్‌కు కలిసివచ్చింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉన్న విషయం తెలిసిందే.

టీ20ల్లో చెత్త రికార్డు:

టీ20ల్లో చెత్త రికార్డు:

ఈ మ్యాచ్‌లో ఫించ్‌, వార్నర్‌, మ్యాక్స్‌వెల్ ఊచకోత కోయడంతో శ్రీలంక పేసర్‌ కసున్ రజిత తన ఖాతాలో పేలవమైన రికార్డు వేసుకున్నాడు. రజిత వేసిన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టర్కీ బౌలర్ తునాహన్ తురాన్ పేరిట ఉండేది. గత ఆగస్టులో చెక్ రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు ఇచ్చాడు.

వార్నర్‌ ఊచకోత:

వార్నర్‌ ఊచకోత:

శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఫించ్, వార్నర్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కి 122 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ తర్వాత ఫింట్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాక్స్‌వెల్ కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ సెంచరీ.. మ్యాక్స్‌వెల్ అర్థ శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది.

99 పరుగులకే పరిమితం:

99 పరుగులకే పరిమితం:

234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో షనక (17) టాప్‌ స్కోరర్‌. ఆసీస్‌ బౌలర్లలో జంపా మూడు.. స్టార్క్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. శతకంతో చెలరేగిన డేవిడ్‌ వార్నర్‌ 'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. రెండో టీ20 మ్యాచ్‌ ఈనెల 30న గబ్బాలో జరగనుంది.

Story first published: Monday, October 28, 2019, 11:13 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X