న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్ భావోద్వేగం: సిడ్నీ టెస్టులో నలుపురంగు బ్యాండ్ ధరించనున్న ఇరు జట్లు

 David Warner Expresses Shock At Sight Of Australia Bushfire, Posts Emotional Message On Instagram


హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ ఓ సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

"నేను ఇప్పుడే ఒక ఫోటో చూశాను. ఇంకా షాక్‌లో ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు దేశాన్ని విపత్కర పరిస్థితులకు నెట్టేసింది. దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి, వాలంటీర్లను మనం గౌరవించాలి. మేము రేపు ఆడటానికి బయలుదేరినప్పుడు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా కలిసి వచ్చి వారు చేస్తున్న పోరాటానికి సెల్యూట్‌ చేస్తారని ఆశిస్తున్నా. నా హృదయం, నా కుటుంబం యొక్క హృదయం మీతో ఉన్నాయి. మనం జీవించడం చోట మనం చేసే పనిని చేయడం ఎంత గొప్పగా ఉంటుందో మనం మరచిపోలేము. దేశం రక్షణ కోసం పోరాడుతున్న మీకు మేము, మా కుటుంబాలు అండగా ఉంటాయి. మీరు నిజమైన హీరోలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది" అని వార్నర్‌ భావోద్వేగ పోస్టును పెట్టాడు.

ఫోటోల సంగతి తర్వాత.. ముందు అకాడమీ గురించి చర్చిద్దాం: గుత్తా జ్వాలఫోటోల సంగతి తర్వాత.. ముందు అకాడమీ గురించి చర్చిద్దాం: గుత్తా జ్వాల

ఈ పోస్టులో ఒక వ్యక్తి తన కుక్కతో పాటు సముద్రం బీచ్‌ ఒడ్డున కూర్చొని ఎదురుగా మంటల్లో కాలిపోతున్న చెట్లను చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో గతకొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంటల తీవ్రత మరింతగా పెరుగుతోంది.

మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌కు చేరుకున్న శ్రీలంక జట్టుమూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌కు చేరుకున్న శ్రీలంక జట్టు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిడ్నీలో నెలకొన్న పరిస్థితులు మూడో టెస్టుకు అంతరాయం కలిగించేలా ఉన్నాయి. మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు కార్చిచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్‌ హెడ్‌ పీటర్‌ రోచ్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో క్రికెటర్లు తమ చేతులకు నల్లరంగు బ్యాండ్స్‌ను ధరించనున్నారు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, మూడో టెస్టులో కివీస్ విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

Story first published: Thursday, January 2, 2020, 15:50 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X