న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ నైపుణ్యం గంగూలీలో ఉంది.. ఏదో ఒక రోజు ఐసీసీకి నాయకత్వం వహిస్తాడు'

David Gower said Sourav Ganguly has political skills to lead ICC

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని నడిపించేంత రాజకీయ నైపుణ్యం గంగూలీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ క్రికెట్‌లో బీసీసీఐని నడపడం అత్యంత కష్టమన్నాడు. కఠినమైన బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇట్టే నిర్వహిస్తున్న గంగూలీ.. ఏదో ఒక రోజు ఐసీసీకి నాయకత్వం వహిస్తాడని గోవర్ జోస్యం చెప్పాడు.

<strong>అరుదైన ఫొటో షేర్‌ చేసిన సచిన్.. ఎవరిదో తెలుసా?!!</strong>అరుదైన ఫొటో షేర్‌ చేసిన సచిన్.. ఎవరిదో తెలుసా?!!

గంగూలీకి ఆ సత్తా ఉంది:

గంగూలీకి ఆ సత్తా ఉంది:

గ్లోఫాన్స్ చాట్ షో సందర్భంగా డేవిడ్ గోవర్ మాట్లాడుతూ... 'బీసీసీఐని సక్రమంగా నడిపే వ్యక్తికి చాలా విషయాలపై అవగాహన ఉండాలి. చాలా సంవత్సరాలుగా నేనో విషయం తెలుసుకున్నా.. బీసీసీఐలో ఒక సక్సెస్‌ఫుల్‌ ప్రెసిడెంట్‌ అయితే అతను ఐసీసీకి సరిపోతాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఆరంభం అదిరింది. ఆ తరహా రాజకీయ లక్షణాలే ఐసీసీలో కూడా అవసరం. గంగూలీలో రాజకీయ లక్షణాలతో పాటు మంచితనం కూడా ఉంది' అని అన్నాడు.

బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవే అత్యంత కష్టమైంది

బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవే అత్యంత కష్టమైంది

'బీసీసీఐ అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకోవడం అంటే అంత తేలిక కాదు. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవే అత్యంత కష్టమైంది. గంగూలీ ఒకరు చెప్పేది వింటాడు.. అతని అభిప్రాయం కూడా సూటిగా చెబుతాడు. ఏ పరిపాలన వ్యవస్థలో ఉండాలన్నా పొలిటికల్‌ స్కిల్స్‌ ముఖ్యం. అవి గంగూలీలో పుష్కలంగా ఉన్నాయి. దాదా ఇప్పటికే బీసీసీఐలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. ఇంకా భవిష్యత్తులో బీసీసీఐ చీఫ్‌గా ఎన్నో మంచి పనులు చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది' అని గోవర్‌ పేర్కొన్నాడు.

ఫాలోయింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు

ఫాలోయింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు

'భారత్‌లో క్రికెట్‌కున్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక దేశంలో ఓ క్రీడకు ఇంతటి అభిమానం ఉండటం ఒక మంచి పరిణామమే. ఆటగాళ్లను వారు ఎంతో ప్రేమిస్తారు. ఎక్కడ ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. మైదానాలు కళకళలాడుతాయి. మైదానాలే చెపుతాయి క్రికెట్ పట్ల భారత అభిమానులకున్న ప్రేమ. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలకు ప్రత్యేక అభిమానులు ఉండడం చాలా సంతోషం' అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు.

సరైన సమయంలో టెస్టు చాంపియన్‌షిప్‌:

సరైన సమయంలో టెస్టు చాంపియన్‌షిప్‌:

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గురించి డేవిడ్ గోవర్‌ మాట్లాడుతూ... సరైన సమయంలో దీన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నాడు. టెస్టు ఫార్మాట్‌ ఏమౌతుందో అనే ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో దీనికి కొత్త రూపు తీసుకురావడం నిజంగా అభినందనీయమన్నాడు. 1970, 80వ దశకాల్లో ఈ టెస్టు చాంపియన్‌షిప్‌ అవసరం లేదని, క్రికెట్‌లో వచ్చిన మార్పులు దృష్ట్యా ఇది ప్రస్తుతం అవసరమని గోవర్‌ అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, May 15, 2020, 18:23 [IST]
Other articles published on May 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X