న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే రోహిత్ టెస్ట్‌ల్లో రాణించలేకపోతున్నాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

David Gower explains Why Rohit Sharma has not been as successful in Tests as in ODIs, T20Is

లండన్: వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు సాధించిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సంప్రదాయక ఫార్మాట్‌లో ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆడకపోవడమే రోహిత్ వైఫల్యానికి కారణమని చెప్పవచ్చు. ఎక్కువగా మిడిలార్డర్‌లో ఆడిన అతను ఆశించిన స్థాయిలో రాణించలేక జట్టులో చోటే కోల్పోయాడు. కానీ గతేడాది స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫార్మాలాతో టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఓపెనర్‌గా రోహిత్ అదరగొట్టాడు. ఇక టెస్ట్‌ల్లో కూడా తనకు తిరుగులేదనిపించుకున్నాడు.

అయితే వీదేశాల్లో ఈ తరహా పెర్ఫామెన్స్ కనబర్చి టెస్ట్‌ల్లో రాణించలేననే అపప్రథను పోగుట్టుకోవాలని భావించాడు. కానీ ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనలో అనూహ్యంగా గాయపడి టెస్ట్ సిరీస్ ఆడకుండా తిరుగు పయనమయ్యాడు. ఆ తరువాత కరోనా భీభత్సంతో ఇంటికే పరిమితమయ్యాడు. అయితే టెస్ట్‌ల్లో రోహిత్ వైఫల్యంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గ్రోవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ లాంటి ఆటగాళ్లు ఎంతోమంది తనకు తెలుసని అన్నారు. వారంతా వన్‌డే, టీ20ల్లో అద్భుతంగా ఆడగలరని, కానీ టెస్టుల విషయానికి వచ్చే సరికి ఘోరంగా విఫలమవుతారని, అంతమాత్రాన వారు ప్రతిభావంతులు కాదనడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. ఇంగ్లండ్‌ జట్టులో కూడా జాసన్ రాయ్ అలాంటి ఆటగాడేనని తెలిపాడు. ప్రపంచకప్ గెలుపులో జాసన్ అద్భుతంగా ఆడాడని, ఓపెనర్‌గా వచ్చి సెంచరీలతో శుభారంభాలనిచ్చేవాడని, కానీ ఆ తరువాత జరిగిన యాషెస్ సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేశాడని గ్రోవర్ గుర్తు చేశాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్.. ఆటగాళ్ల ముందు ఎన్నో సవాళ్లను ఉంచుతుందని, అవి వన్‌డేల్లో కానీ, టీ20ల్లో కానీ ఎదురుకావని గ్రోవర్ చెప్పాడు.

David Gower explains Why Rohit Sharma has not been as successful in Tests as in ODIs, T20Is

ఈ కారణంగానే రోహిత్ శర్మ, జేసన్ రాయ్ లాంటి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌లో రాణించలేకపోతున్నారని వివరించారు. అందువల్లే ఆటగాడి అసలైన ప్రతిభ టెస్టు క్రికెట్‌లోనే బయటపడుతుందని అంటారని, టెస్ట్ క్రికెట్‌ను క్రికెట్‌ పెద్దన్నగా చెప్పడానికి ఇదే కారణమని గ్రోవర్ చెప్పుకొచ్చాడు.

ఇరగదీసిన ఇంగ్లండ్ బౌలర్లు.. మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ఇరగదీసిన ఇంగ్లండ్ బౌలర్లు.. మూడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్

Story first published: Sunday, July 12, 2020, 19:56 [IST]
Other articles published on Jul 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X