న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ నాపై భయాన్ని పోగొట్టింది: ధోనీ

Daughter changed me as a person: MS Dhoni

హైదరాబాద్: ధోనీ.. ఈ ఐపీఎల్‌లో తన పూర్వపు ఫామ్‌తో చెలరేగి ఆడాడు. ప్రతి మ్యాచ్‌కు ప్రణాళికలు మార్చుకుంటూ.. జట్టును విజయపథం వైపు నడిపించాడు. ఐపీఎల్‌ ప్రాక్టీసులో అందరికంటే ముందుగానే పాల్గొని ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ లీగ్‌కు అతనితో పాటుగా భార్య, జీవా కూడా స్టేడియానికి తరలివచ్చారు. ప్రతి మ్యాచ్‌లోనూ కనిపించిన జీవా దాదాపు సెలబ్రిటీగా మారిపోయింది. ఇలా జీవా స్టేడియానికి రావడం తనకెంతో ఉపయోగపడిందంటున్నాడు ధోనీ.

జీవా.. తననో పూర్తిస్థాయి వ్యక్తిగా మార్చిందని ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో చాలా మార్పులకు ఆమే కారణమన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ షోలో పాల్గొన్న మహీ.. తన కూతురుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తాను క్రికెటర్‌గా ఎలా మారాడో తెలియదు. కానీ మనిషిగా మార్చింది మాత్రం తన కూతురు జీవానేనని వెల్లడించాడు. ఎందుకంటే కూతుళ్లు వాళ్ల తండ్రులకు చాలా దగ్గరగా ఉంటారని విన్నా అని తెలిపాడు.

Daughter changed me as a person: MS Dhoni

పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి

తొలినాళ్లలో ఈ విషయం కాస్త భిన్నంగా ఉండేదన్నాడు. జీవా పుట్టినప్పుడు (మూడేండ్ల కిందట) తాను దగ్గరగా లేకపోవడం చాలా బాధ కలిగించిందన్నాడు. ఎక్కువగా క్రికెట్ ఆడుతూ దేశాలు తిరుగుతుండటంతో తన కూతురితో ఎక్కువగా గడుపలేకపోయానని చెప్పాడు. దీనివల్ల ఆరంభంలో జీవా దగ్గర కొద్దిగా ఇబ్బంది ఎదురైందన్నాడు.

'జీవా అన్నం తినకపోతే వాళ్లమ్మ.. నాన్న వస్తున్నారు త్వరగా తినేయ్ ! అని భయపెట్టేది. అల్లరి చేసినప్పుడు నాన్న వస్తున్నాడు అలా చేయొద్దని చెప్పేది. దీంతో ఎప్పుడైనా జీవాను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి గుర్తొచ్చి ఓ అడుగు వెనుకకు వేసేవాడ్ని. ఆరంభంలో అలా భయపడుతున్న జీవాను ఈ ఐపీఎల్ మరింత దగ్గరకు చేర్చింది' అని ఈ మాజీ కెప్టెన్ వివరించాడు. ఈసారి లీగ్‌లో ప్రతి మ్యాచ్‌కు జీవా తనతో పాటే ఉందని చెప్పిన మహీ.. ఇది చాలా అద్భుతంగా అనిపించిందన్నాడు.

Story first published: Wednesday, June 13, 2018, 15:50 [IST]
Other articles published on Jun 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X