న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా?.. డారెన్‌ సామీని చూసి నేర్చుకోండి (వీడియో)!!

Darren Sammy Sports Unique Mask At Home Under Self quarantine

జమైకా: కరోనా వైరస్ ప్రస్తుత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా బాధపడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల మందికి పైగా చనిపోయారు. ఇక కొన్ని లక్షల మందికి వైరస్ సోకింది. ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశాలు ఆదేశించాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాడు.

కరోనా జాగ్రత్తలు:

కరోనా జాగ్రత్తలు:

డారెన్ సామీ ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ టీ20 లీగ్‌ను సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ నిర్వహించకుండానే రద్దు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు పయనమయ్యారు. సామీ కూడా ఇంటికెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. వైరస్‌బారి నుంచి తప్పించుకునేందుకు.. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒక ప్రత్యేక మాస్క్‌ ధరించాడు.

 సామీని చూసి నేర్చుకోవాలి :

సామీని చూసి నేర్చుకోవాలి :

తన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ స్వదేశానికి చేరుకున్నానని డారెన్ సామీ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవడం ఎలాగో డారెన్‌ సామీని చూసి నేర్చుకోవాలి అని ఫాన్స్ అంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించాలని కొందరు, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి మరికొందరు సూచిస్తుండగా.. సామీ ఇలా చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్వీయ నిర్బంధంలో ఉంటా:

స్వీయ నిర్బంధంలో ఉంటా:

ముందు కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, అయినా ఇంటికెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులతో కలవకుండా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటానని డారెన్ సామీ చెప్పాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న సామీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సామాజిక దూరం పాటించే విషయాన్ని తెలియజేస్తూ డాన్స్‌ చేస్తున్న వీడియో హాస్యాస్పదంగా ఉంది. వీడియోలో సామీ తన ముఖాన్ని గ్లాసెస్, మాస్క్‌తో కవర్ చేసుకున్నాడు.

ఊపరి పీల్చుకున్న పీసీబీ:

ఊపరి పీల్చుకున్న పీసీబీ:

సామీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆశించిన మేర సత్తా చాటలేకపోయాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ లాడిన సామీ.. కేవలం 44 పరుగులే చేశాడు. అతను ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడిన ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి మొత్తం కరోనా టెస్టులు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్‌ రిపోర్టు రాకపోవడంతో పీసీబీ ఊపరి పీల్చుకుంది.

Story first published: Saturday, March 21, 2020, 19:56 [IST]
Other articles published on Mar 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X