డేనియెల్లి పెళ్లి ప్రపోజల్‌కి కోహ్లీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

Posted By:
Daniell Wyatt recalls her famous Virat Kohli proposal

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియెల్లి వాట్‌ గుర్తుండే ఉంటుంది. 2014లో టీ20 వరల్డ్ కప్ కోసం ధోని నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో దక్షిణాఫ్రికా జట్టుపై కోహ్లీ ప్రదర్శన చూసిన డేనియెల్లి పీకల్లోతు ప్రేమలో పడిపోయింది.

ట్విటర్‌ వేదికగా 'కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో' అని ప్రపోజల్‌ చేసి వార్తల్లో నిలిచింది. డేనియెల్లి ట్వీట్ చేసిన పది నిమిషాలకే వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చాయి. అప్పట్లో ఈ వార్త భారత్‌లో సంచలనం సృష్టించింది. అయితే డేనియెల్లి ట్వీట్‌కు ట్విట్టర్‌లో కోహ్లీ ఎటువంటి సమాధానం ఇవ్వని సంగతి తెలిసిందే.

భారత పర్యటనలో కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ఆడతా: డేనియెల్లి

అయితే ఆ తర్వాత అదే ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చినపుడు డెర్బిషైర్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వార్మప్‌ మ్యాచ్‌కు వచ్చిన డేనియెల్లి మ్యాచ్‌ అనంతరం కోహ్లీతో కలిసి ఫోటో దిగింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ 'ట్విటర్లో అలాంటి సందేశాలు పెట్టొద్దని.. కొందరు వాటిని నిజమనుకుంటారని కోహ్లీ హెచ్చరించాడు. నేను సారీ చెప్పా' అని పేర్కొంది.

ఆ తర్వాత కోహ్లీ... డేనియెల్లికి తన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకని అనుకుంటున్నారా? త్వరలో ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్‌ పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్‌ జట్టులో డేనియెల్లి సభ్యురాలిగా ఉంది. దీంతో భారత పర్యటనలో విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతానని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 'విదేశీ పర్యటనల్లో కూడా కోహ్లీ బ్యాట్‌నే ఉపయోగిస్తున్నా. భారత పర్యటనలో నేను కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆడతాను. ఎందుకంటే నేను వాడే బ్యాట్‌ విరిగిపోయింది' అని పేర్కొంది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ముక్కోణపు టీ20 సిరీస్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు పాల్గొనున్నాయి.

Story first published: Wednesday, March 14, 2018, 13:15 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి